మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాకు మొదట రోజునే మంచి టాక్ వచ్చింది. మూవీ సూపర్ హిట్టని మెగాస్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికంటే ముందు వచ్చిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయింది. విచిత్రం ఏమిటంటే గాడ్‌ఫాదర్ మొదటి రోజు కలెక్షన్లు డిజాస్టర్‌గా ముద్రపడిన ఆచార్య కలెక్షన్ల కంటే కూడా తక్కువ వచ్చాయట. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి గాడ్‌ఫాదర్ సినిమాకు 21.4 కోట్లు గ్రాస్ వచ్చిందట. అంటే 12.97 కోట్ల నెట్ షేర్… నైజాంలో 3.29 కోట్లు, సీడెడ్‌లో 3.18 కోట్లు, యూఎస్‌లో 1.26 కోట్ల కలెక్ట్ చేసిందని ఆ వార్తలను బట్టి తెలుస్తోంది. ఆచార్య మొదటిరోజు 29.50 కోట్ల షేర్…కానీ గాడ్‌ఫాదర్ మొదటి రోజు షేర్ 12.97 కోట్లు మాత్రమే. అయితే ఆచార్య దర్శకుడు కొరటాల శివ కావడం, అందులో రాంచరణ్ కూడా నటించడం వల్ల మొదటి రోజు కలక్షన్లు ఆ విధంగా ఉన్నాయి. కానీ గాడ్‌ఫాదర్‌లో స్పెషల్ అట్రాక్షన్ ఏమీ లేదు. బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ వల్ల సినిమాకు ఎలాంటి ఉపయోగం లేదని చిరు అభిమానులే చెప్పుకుంటున్నారు. మరోవైపు రెండోరోజు ఏపీలో కలెక్షన్లు పడిపోయాయని ప్రచారం జరుగుతోంది. గాడ్‌ఫాదర్‌కు పాజిటివ్ టాక్ వచ్చినా ఆచార్యతో పోలిస్తే మొదటి రోజు కలెక్షన్లు పడిపోవడం వెనకాల మరో కారణం ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఆచార్య సినిమాను భారీ రేట్లకు అమ్మారు. గాడ్‌ఫాదర్ ను మొత్తం అమ్మకుండా ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో కేవలం అడ్వాన్సులు తీసుకుని విడుదల చేశారట. పైగా ఆచార్యతో పోలిస్తే గాడ్‌ఫాదర్ ను తక్కవ థియేటర్లలో రిలీజ్ చేశారట. అందుకే ఆచార్యతో పోలిస్తే గాడ్‌ఫాదర్ కలెక్షన్లు తక్కువగా కనిపిస్తున్నా…దీనివల్ల పెద్ద నష్టమేమీ లేదని అంటున్నారు. శని, ఆదివారాలు గడిస్తేకానీ గాడ్ ఫాదర్ ఒరిజినల్ కలెక్షన్ల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.