పొన్నియిన్ చూట్టూ పెరుగుతున్న ప్రాబ్లమ్స్

By KTV Telugu On 8 October, 2022
image

రాజ రాజ చోళ చుట్టూ మొదలైన రాజకీయం
చోళులు హిందూవులు కారా?

తమిళ నాట పొన్నియిన్ సెల్వన్ వసూళ్లు, వివాదాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముందు వసూళ్ల విషయం మాట్లాడుకుంటే ఈ సినిమా 400 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. గతంలో ఏ తమిళ సినిమా బద్దలు కొట్టని రికార్డులు క్రియేట్ చేస్తోంది. జస్ట్ 7 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరడం అంటే చిన్న విషయం కాదు. నవల ఆధారంగా సినిమా తెరకెక్కడం, మణిరత్నం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంతో తమిళనాడులో పొన్నియిన్ సెల్వన్ సినిమా చూడటమే ఒక పండగలా మారింది. మరో వైపు ఈ సినిమా చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. అసలు రాజ రాజ చోళ అనే చక్రవర్తి హిందూనే కాదని, కాని అతడిని హిందూగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తమిళ దర్శకుడు వెట్రీమారన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. ఆ తర్వాత కమల్ కూడా వెట్రీమారన్ మాటల్లో నిజం ఉందని తెలిపాడు. చోళ కాలంలో అసలు హిందూ అనే పదమే లేదని, ఆ పదం బ్రీటీషర్స్ సృష్టించారని, కాబట్టి బలవంతంగా చోళుడిని హిందుగా మార్చవద్దని హితువు పలికాడు కమల్. శైవం , వైష్ణవం ,జైనిజం మాత్రం ఉండే కాలానికి చెందిన వాడు చోళరాజు అంటున్నాడు కమల్. మరోవైపు వెట్రీ మారన్, కమల్ వాఖ్యాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు బీజేపీ నాయకులు. తమిళుల గుర్తుంపును తమ అవసరాల కోసమే వారు దాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ లీడర్స్ ఆరోపిస్తున్నారు.