సునామీలాంటి సుడి..దటీజ్‌ మోడీ!

By KTV Telugu On 2 October, 2022
image

– ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..క్రేజ్‌ ఇక్కడ!
– తగ్గేదేలే.. బ్రాండ్‌వాల్యూలోనూ మోడీనే టాప్‌!

ఒక్కొక్కరి సుడి అంతే. కొందరి గ్రాఫ్‌ అమాంతం పడిపోతుంటే…కొందరికి మాత్రం రాజపూజ్యం ఓ రేంజ్‌లో నడుస్తుంటుంది. ప్రధాని నరేంద్రమోడీ క్రేజ్‌ కూడా అలాగే ఉంది.
టాప్‌ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌, మైక్రోబ్లాగింగ్‌ సైట్లలో మోదీని ముందున్నారు. చివరికి ఫాలోయర్ల రికార్డులో మన ప్రధాని ప్రపంచ నేతలకున్న క్రేజ్‌ని కూడా ఓవర్‌టేక్‌ చేసేశారు. తాజాగా మోడీ మరో అరుదైన రికార్డు సాధించారు.
భారత రాజకీయ నాయకుల విభాగంలో డిజిటల్‌ ప్రపంచంలో అత్యంత గొప్ప బ్రాండ్‌ ఇమేజ్‌ని మోడీ సొంతం చేసుకున్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా, వికీపీడియా, యూట్యూబ్‌, గూగుల్‌ ట్రెండ్స్‌, గూగుల్‌ సెర్చ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై పొలిటీషియన్స్‌, సెలబ్రిటీస్‌, పాపులర్‌ బ్రాండ్స్‌, క్రికెటర్స్‌ స్టేటస్‌, ఫాలోయర్ల ప్రతిస్పందనలను అనాలసిస్‌ అండ్‌ డిజిటల్‌ ర్యాంకింగ్‌ సంస్థ చెక్‌బ్రాండ్‌ విశ్లేషించింది. 10 కోట్లకు పైగా ఆన్‌లైన్‌ ఇంప్రెషన్లను విశ్లేషించి వారి బ్రాండ్‌ ఇమేజ్‌లను లెక్కగట్టింది. 500 మంది రాజకీయ నాయకుల ప్రొఫైల్స్‌ని విశ్లేషిస్తే ప్రధాని మోడీ బ్రాండ్‌ ఇమేజ్‌ విలువ రూ.413కోట్లుగా తేల్చింది.
ఏడీజీ ఆన్‌లైన్‌, చెక్‌బ్రాండ్‌ సంస్థల ఎండీ అనూజ్‌ సయాల్‌ అంచనా ప్రకారం హర్‌ ఘర్‌ తిరంగా క్యాంపైన్‌ తర్వాత మోడీ గ్రాఫ్‌ మరింత పెరిగింది. చెక్‌బ్రాండ్‌ చివరిసారిగా 2020లో జాబితా విడుదల చేసినప్పుడు మోడీ బ్రాండ్‌ వాల్యూ రూ.327 కోట్లు. ఇప్పుడది దగ్గరదగ్గర వందకోట్లు పెరిగింది. అన్ని బ్రాండ్లు, వ్యక్తుల జాబితాలో ప్రధాని మోడీ 4వ ర్యాంక్‌లో ఉన్నారు. ఆయన కంటే ముందు వరసలో నైక్‌/నైకీ, సామ్‌సంగ్‌ సంస్థలతో పాటు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఉన్నారు. తాజా జాబితాలో పొలిటికల్‌ లీడర్ల విభాగంలో రూ.96.8 కోట్లతో అమిత్‌ షా, రూ.61.7 కోట్ల బ్రాండ్‌వాల్యూతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.