చిప్ చేసిన మేలు-ఒక్కోసారి టెక్నాలిజీ మనిషికి ఊహించని మేలు చేస్తుంది. అలాగే కీడు చేస్తుంది. మనం ఉపయోగించేదాన్ని బట్టి అది ఉపయోగించే పనిని బట్టి ఉంటుంది. .ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువు దూరమైతే ఆబాధ చెప్పుకోలేం. బ్రిటీష్ కొలంబియాలోని ఓ పిల్లి ఐదేళ్ల క్రితం తప్పిపోయింది. యజమాని తెగ వెతికారు. తన పిల్లి పోయిందని తెలిసోనోళ్లకి అందరికి చెప్పింది.
ఇదంతా జరిగి ఐదేళ్లు దాటిపోయింది. ఉన్నట్టుండి ఒక రోజు ఫోన్ వచ్చింది. మీ పిల్లి మాదగ్గరుంది అని . అది ఆ యజమానికి నమ్మబుద్ది కాలేదు. వాళ్లు చెబుతోందా నిజమేనా అని సందేహం కలిగింది. బ్రిటిష్ కొలంబియాలో ఒక పిల్లి తమకు దొరికిందని జంతుసంరక్షకులు చెప్పారు. వారు ఆ పిల్లి గురించి ఆరా తీశారు. అసలు యజమాని ఎవరు తెలుసుకునే ప్రయత్నించారు. పశువైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు.
పిల్లి మెడలో చిప్ ఉన్న సంగతి ఆ యజమానికి కూడా తెలియదు. మెడలో ఉన్న బెల్ట్ లో చిప్ ను పెట్టారు. అంటారియోలోని సెయింట్ కాథరిన్స్‌లో నివసిస్తున్న ఒక మహిళ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల క్రితం ఆ పిల్లి తప్పిపోయిందని తేలింది.
పిల్లి తన అసలు యజమానిని తిరిగి కలవడానికి అంటారియోకు త్వరలో యాత్ర చేస్తుందని జంతుపరిరక్షణ సమితి సభ్యురాలు ఓక్లీ చెప్పారు. పెంపుడు జంతువులను మైక్రోచిప్ చేయడం యొక్క ప్రాముఖ్యతను రీయూనియన్ హైలైట్ చేస్తుందని ఆమె అన్నారు. ఇదంతా ఆ బాగానే ఉంది అసలా ఆ పిల్లి ఎలా పోయిందని గుర్తు చేసుకుంటే యజమాని.. షాపింగ్ చేయడానికి వెళ్లినప్పుడు అది తప్పిపోయిందని చెప్పింది.
వాహనాలు పోతే కనుక్కోవడానికి చిప్ టెక్నాలిజీ పెంపుడు జంతువులకి ఉపయోగించడమే ఇక్కడ హైలెట్. అల్లారు ముద్దుగా పెంచుకున్ని పెంపుడు జంతువు తప్పిపోయి తిరిగి దొరికితే ఆ ఆనందమే వేరు కదా..