ఏబీవీ మళ్లీ ఆ పనిచేస్తారా.. అందులోనే ఊరట వెదుక్కుంటారా?

By KTV Telugu On 20 May, 2022
image

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉరఫ్ ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స‌ర్వీస్‌లోకి తీసుకుంటున్న‌ట్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. ప్రస్తుతానికి జనరల్ అడ్మినిస్టేషన్ డిపార్టమెంట్ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఏబీవీ ఏం చేయబోతున్నారు?

టీడీపీ హ‌యాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అధికారానికి అత్యంత చేరువగా ఉన్నారు. అందుకే వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత ఆయన్ను టార్గెట్ చేసిందని చెబుతారు. స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌కు అతిక్ర‌మించి నిర్ణ‌యాలు తీసుకున్నార‌నే అభియోగాల‌పై ఏబీవీని ఏపీ స‌ర్కార్ 2020, ఫిబ్ర‌వ‌రి 8న స‌స్పెండ్ చేసింది. అప్ప‌టి నుంచి ఆయ‌న ఎలాంటి పోస్టింగ్ లేకుండా కాలం గ‌డుపుతూ వ‌చ్చారు. ఆయన రెండు మూడు స్కాములు చేసినట్లు ఏపీ సర్కారు ఆరోపించింది.

తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ ఏబీవీ కోర్టుకెక్కారు. హైకోర్టులో ఆయనకు అనుకూల తీర్పు వచ్చింది. దానితో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. అక్కడ కూడా ప్రభుత్వ వాదనతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. స‌ర్వీస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం రెండేళ్ల‌కు మించి స‌స్పెన్ష‌న్ కొన‌సాగించ‌డానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం గుర్తుచేసింది. సస్పెన్షన్ ఫిబ్రవరి 7నే ముగిసిందని అంటూ.. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది.

 

మళ్లీ కోర్టుకెళతారట

ఏబీవీకి ఇప్పుడుకాకపోతే కొన్ని రోజుల తర్వాతైనా పోస్టింగ్ ఇవ్వాలి. నిజానికి ఆయన ఉండటం జగన్ ప్రభుత్వానికి అందులో పెద్దలకు ఇష్టం లేదు. భవిష్యత్తులో లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకే ఆయనను ఉద్యోగంలోకి తీసుకున్నారు. వీలైతే ఆయన్ను మళ్లీ ఇబ్బంది పెట్టాలన్న కోరిన ప్రభుత్వ పెద్దలకు ఉంది. పైగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చిన రోజున ఏబీవీ చాలా ఆవేశంగా మాట్లాడారు. తన సస్పెన్షన్ కు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. తనను సస్పెండ్ చేసి కోర్టుకెళ్లడం కారణంగా ప్రజాధనం వృథా అయ్యిందని.. ఆ డబ్బులు కూడా కక్కిస్తారని సవాలు చేశారు. ఇలాంటి మాటలు ప్రభుత్వ పెద్దల చెవుల్లో రింగుమని మారుమోగుతూనే ఉంటాయి దానితో వాళ్లు ఏబీవీని ఒక ఆట ఆడుకునే ప్రమాదం ఉంది. నెలకో పోస్టింగ్ మారుస్తూ ఎక్కడా కుదురుగా ఉండనివ్వకుండా చేసే వీలుంది. అందుకే ఏబీవీ వేరే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను సస్పెండ్ చేసిన రోజు నుంచి విధుల్లోకి తీసుకోవాలని ఏబీవీ అంటున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో కూడా అదే అంశం ఉందని ఆయన చెబుతున్నారు.. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో మాత్రం తన సస్ఫెన్షన్ ముగిసిన తేదీ… 2022 ఫిబ్రవరి 7 నుంచి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ముద్రించారన్నారు. ఇదీ ముమ్మాటికి అన్యాయమని, కోర్టు ధిక్కారమని ఏబీవీ చెబుతున్నారు. సస్పెన్షన్ చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన తర్వాత తనను సస్పెండ్ చేసిన రోజు నుంచి విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వాదన.
చీఫ్ సెక్రటరీని కలుసుకుని పూర్తి వివరాలు చెప్పాలనుకుంటే అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఏబీవీ వెల్లడించారు. కొన్ని రోజులు చూసి మళ్లీ కోర్టులో కేసు వేస్తానని ఏబీవీ ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు..

రాజీనామా చేస్తారా…

ఏబీవీకి ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాతైనా పోస్టింగ్ ఇవ్వాలి. నిజానికి ఆయన ఉండటం జగన్ ప్రభుత్వానికి అందులో పెద్దలకు ఇష్టం లేదు. భవిష్యత్తులో లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకే ఆయనను ఉద్యోగంలోకి తీసుకున్నారు. వీలైతే ఆయన్ను మళ్లీ ఇబ్బంది పెట్టాలన్న కోరిన ప్రభుత్వ పెద్దలకు ఉంది. పైగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చిన రోజున ఏబీవీ చాలా ఆవేశంగా మాట్లాడారు. తన సస్పెన్షన్ కు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. తనను సస్పెండ్ చేసి కోర్టుకెళ్లడం కారణంగా ప్రజాధనం వృథా అయ్యిందని.. ఆ డబ్బులు కూడా కక్కిస్తారని సవాలు చేశారు. ఇలాంటి మాటలు ప్రభుత్వ పెద్దల చెవుల్లో రింగుమని మారుమోగుతూనే ఉంటాయి. దానితో వాళ్లు ఏబీవీని ఒక ఆట ఆడుకునే ప్రమాదం ఉంది. నెలకో పోస్టింగ్ మారుస్తూ ఎక్కడా కుదురుగా ఉండనివ్వకుండా చేసే వీలుంది. అందుకే ఏబీవీ వేరే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మీద పంతం నెగ్గించుకుని.. మళ్లీ ఉద్యోగంలో ఎలాగూ చేరిన సంతృప్తి పొంది…త్వరలోనే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తారన్న చర్చ జరుగుతోంది. నెలకో శాఖకు మారే బదులు రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఏబీవీ ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తారని కూడా కొందరు అంటున్నారు. అదే పని జరిగితే ఆయన ఏ పార్టీలో చేరతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..