డిసెంబర్ లో హన్సిక మ్యారేజ్

By KTV Telugu On 3 November, 2022
image

వరుడు చిన్నప్పటి స్నేహితుడు
వివాహ వేడుకకు మంచు ఫ్యామిలీ?

హన్సిక పెళ్లి పీటలెక్కబోతోంది. మిగితా కథానాయికల దారిలోనే తాను కూడా ఒక బిజినెస్ మెన్ ను వివాహం చేసుకోబోతోంది. కాకపోతే వరుడు హన్సికకు చిన్నప్పటి నుంచి తెల్సిన వాడు, సోహైల్ ను వివాహం చేసుకోబోతున్నట్లు హన్సిక, ఇన్ స్టా ఎకౌంట్ ద్వారా కన్ ఫామ్ చేసింది. ప్యారీస్ వేదికగా సోహైల్ తనని పెళ్లి చేసుకోవా అని అడగడం,
ఆ వెంటనే హన్సిక యస్ చెప్పడం చకా చకా జరిగిపోయాయి. డిసెంబర్ 2 నుంచి రాజస్థాన్ లో ఓ పురాతన భవంతిలో,
పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 4న వీరిద్దరు పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబానికి చెందినవారు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. హన్సికకు క్లోజ్ ఫ్రెండ్స్ గా వెలుగుతున్న మంచు లక్ష్మి, మంచు విష్ణు, ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కి హన్సిక మాజీ ప్రియుడు శింబు కూడా హాజరు అవుతాడని తమిళ మీడియాలో ప్రచారం సాగుతోంది. 2013లో ఓ తమిళ సినిమాలో నటిస్తూ శింబు, హన్సిక ప్రేమలో పడ్డారు. ఏడాది పాటు నడిచిన ప్రేమాయణంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఆ తర్వాత మాత్రం రిలేషన్ కు గుడ్ బై చెప్పారు.