మీనాకు రెండో పెళ్లి?

By KTV Telugu On 1 December, 2022
image

త్వరలో కొత్త జీవితం ప్రారంభం అంటూ వార్తలు
ఆగ్రహం వ్యక్తం చేసిన సీనియర్ నటి

మీనా రెండో పెళ్లి వార్తలు ఇఫ్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2009లో విద్యా సాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లాడింది మీనా. వీరి అనుబంధానికి ప్రతీకగా నైనిక జన్మించింది. ఈ చిన్నారి తమిళంలో తెరకెక్కిన తేరిలో నటించింది.
తల్లికి తగ్గతనయగా పేరు తెచ్చుకుంది. మరో వైపు మీనా కూడా తల్లి పాత్రలు చేస్తూ బిజీగా కనిపించింది.
అంతా బాగుంది అనుకుంటుండగా, జూన్ లో ఊపిరి తిత్తుల ఇన్ ఫెక్షన్ తో మీనా భర్త కన్నుమూశారు.
దాంతో మీనా గుండె పగిలిపోయింది. ఇప్పుడిప్పుడు ఆమె భర్త జ్ఞాపకాల నుంచి బయటపడుతోంది.
ఈ సమయంలో ఇంట్లో వారి ఒత్తిడితో రెండో పెళ్లికి సిద్ధమవుతోందని  పైగా తన భర్తకు తెల్సిన వ్యక్తితోనే రెండో పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారం పై  మీనా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలను పట్టించుకోవద్దని, తన అభిమానులకు తెలిపింది. పైగా తప్పుడు వార్తలు రాసే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చింది.