నేను చావలేదు.. బతికే ఉన్నా : సమంత

By KTV Telugu On 8 November, 2022
image

నేను చనిపోలేదు బతికే ఉన్నాను. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు అన్నారు ప్రముఖ నటి సమంత. ఈ మాటలు వింటే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. తన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గిలిగింతలు పెట్టిన సమంత ప్రస్తుతం మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతోందన్న విషయం అందరికీ తెలసిందే. అది చాలా అరుదుగా వచ్చే జబ్బని, ఒక్కోసారి అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమవుతుందని తెలిసి ఆమె అభిమానులు కలత చెందారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద సినిమా నవంబర్ 11న విడుదల కాబోతోంది. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత చికిత్స తీసుకుంటోంది. దాంతో యశోధ సినిమా ప్రమోషన్స్‌కి ఆమె రాదని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా తన స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా యాంకర్ సుమ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు. తన ఆరోగ్యానికి సంబంధించిన వదంతులపై కూడా సమంత వివరణ ఇచ్చింది.

మనకి అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకరోజు ఒకలా మరొక రోజు మరోలా ఉంటుంది. నాకు ఒక్కో రోజు ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. అని కన్నీళ్లు పెట్టుకుంది సమంత. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం వచ్చానా అని అనిపిస్తుంది కానీ యుద్ధం చేయాలి. నేనొక్కదానినే కాదు ఎంతో మంది జీవితం కోసం యుద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తాం అని తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంది. నేను కొన్ని ఆర్టికల్స్ చూశాను నాకున్న వ్యాధి చాలా ప్రాణాంతకరమైన వ్యాధి అని రాశారు. కానీ ప్రస్తుతం నేనున్న స్టేజ్‌లో అది ప్రాణాంతకమైనది మాత్రం కాదు అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికైతే నేను చావలేదు కానీ ఇబ్బంది మాత్రం ఉంది. నేను ఫైట్ చేస్తూనే ఉన్నా అని చెప్పుకొచ్చింది. పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ప్రస్తుతానికైతే నేను చావట్లేదు అని స్పష్టం చేసింది సమంత. సమంత గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు ఆమె అభిమానులు.