ఆదిపురుష్ టీమ్ కు మరో షాక్

By KTV Telugu On 11 October, 2022
image

యూనిట్ కు నోటీసుల జారీ చేసిన ఢిల్లీ కోర్టు
హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కోర్ట్ ను ఆశ్రయించిన సంస్థ

ఆదిపురుష్ కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కాని సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ వస్తోందని మరోవైపు ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా మొదటి మాటే నిజం. ఆదిపురుష్ కు కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ కోర్టు ప్రభాస్ తో సహా చిత్ర యూనిట్ కు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన ఒక సంస్థ హిందూవుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఆదిపురుష్ ఉందని కోర్టును ఆశ్రయించింది. సినిమా పై స్టే విధించాలని కోరింది. పిటిషన్ పై విచారించిన ఢిల్లీ కోర్టు ప్రభాస్ తో పాటు దర్శకుడు,నిర్మాత, హీరోయిన్ కృతి సనన్ కు నోటీసులు జారీ చేసింది. మొత్తం వ్యవహారం చూస్తుంటే ఆదిపురుష్ థియేటర్స్ వరకు వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. దర్శకుడు పంతానికి పోతున్నాడు అని, కొత్తతరం ప్రేక్షకుల కోసం తీసిన సినిమా అని చెబుతున్నాడు కానీ, మార్పులు చేర్పులు చేస్తానని చెప్పడం లేదు. దాంతో ఆదిపురుష్ డైరెక్టర్ పై పలు వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జనవరి 12న విడుదల ముహూర్తం పెట్టుకున్న ఈ సినిమాకు కాంట్రవర్సీ కావాల్సినంత ప్రమోషన్ చేసి పెడుతోందనే ప్రచారం సాగుతోన్న, కోర్టు నుంచి నోటీసులు, రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు, సోషల్ మీడియాలో బ్యాన్ ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ దర్శకనిర్మాతలను నిద్రపట్టకుండా చేస్తోంది.