పాత నినాదం…కొత్త కలర్.. మస్తు టైమ్ పాస్….

By KTV Telugu On 15 April, 2022
image

కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైళ్లు బయటకు తీస్తారు.. బూజు దులుపుతారు.. కొన్ని రోజులు వాటిపై కసరత్తు చేస్తారు.. తర్వాత మళ్లీ అటకమీద పడేస్తారు. బూజు పడుతుంది.. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. రాజకీయాల్లో కూడా అంతే.. అవసరమైనిపించినప్పడూ పాత నినాదాలను మళ్లీ తెర పైకి తెస్తారు. వాళ్ల అదృష్టమో.. జనం దురదృష్టమో… కొన్ని నానాదాలు సక్సెస్ అవుతాయి.. నాయకులు, వారి అనుబంధ సంస్థలు రెచ్చిపోతారు. ఇంకేముంది ఇరగదీసేశామనుకుంటారు…..

ఆరెస్సెస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ మళ్లీ పాత పాట పాడుతున్నారు. అఖండ్ భారత్ స్వప్నం సాకారం కావడానికి ఎంతో దూరం లేదని ఆయన అంటున్నారు. మరో పాతిక సంవత్సరాల కాలంలో అఖండ్ భారత్ సాధ్యమని, కాస్త శ్రమిస్తే అందులో సగం టైమ్ లోనే అఖండ్ భారత్ ను చూస్తామని ఆయన చెబుతున్నారు. బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్పీ లాంటి సంస్థలను ఉత్తేజ పరిచేందుకు ఆ మాట
చెప్పినట్లే కనిపించినా… అది వారి దీర్ఘకాలిక నినాదం కావడంతో… తమ అజెండాను అమలు చేసేందుకు హిందూ సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని చెప్పక తప్పదు…

ఇండియాను అదే భారత్ ను హిందూ రాజ్యంగా మార్చాలన్నది బీజేపీ ఆరెస్సెస్ సంకల్పం. భౌగోళికంగా అఖండ్ భారత్ ఏర్పాటైతేనే హిందూ రాజ్య స్థాపన సాధ్యమన్నది వారి విశ్వాసం. వందేళ్ల క్రితమే గోల్వాల్కర్, సావర్కర్ లాంటి నాయకులు హిందూ రాష్ట్ర్, అఖండ్ భారత్ నినాదాలను ప్రచారం చేశారు. వందేళ్లలో ఈ భూభాగం హిందూ రాష్ట్రంగా మారుతుందని కూడా వారు చెప్పుకున్నారు. వారిచ్చిన వందేళ్ల గడువు పూర్తి కావస్తుండటంతో మోహన్ భగవత్ లాంటి నేతల్లో అసహనం పెరిగిపోతోంది. ఇంకెంత కాలం వేచి చూడాలన్నట్లుగా హిందూత్వ వాదులను ఉత్తేజ పరిచి, రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు…

ఆరెస్సెస్ నేత శేషాద్రి దీనిపై ఒక పుస్తకం కూడా రాశారు. అరవై ఏళ్ల క్రితం విడిపోయిన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మళ్లీ కలిసిపోయే అవకాశాలున్నాయని బీజేపీ, ఆరెస్సెస్ కీలక నేత రామ్ మాధవ్ ప్రచారం చేశారు. ప్రజాభిష్ణం మేరకే ఈ పని జరుగుతుందని ఆయన చెప్పారు. 2025 నాటికి పాకిస్థాన్ వాలంటరీగా ఇండియాలో కలిసిపోతుందని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ తరచూ చెబుతారు. భారత్, పాకిస్థాన్ విలీనమైతేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు వాదిస్తున్నారు. సెక్యులర్ ప్రభుత్వమే దేశాన్ని నడిపిస్తుందని ఆయన అంటారు….

15 ఏళ్లలో అఖండ్ భారత్ సాధ్యమా

రాబోయే 15 ఏళ్లలో దక్షిణాసియా భౌగోళిక స్వరూపం మారిపోతుందని మోహన్ భగవత్ ప్రచారం చేస్తున్నారు. అఖండ్ భారత్ కల నెరవేరుతుందని ఆయన అంటున్నారు. ఇండియాలో ఒక వర్గం కోరిక ఎలా తీరుతుందన్నది ప్రశ్నే. తొమ్మిది దేశాలు అందుకు అంగీకరించాలి కదా… గతంలో సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్..సీఐఎస్.. ఏర్పడినట్లుగా కొన్ని పారిపాలనా అంశాల్లో మాత్రమే ఆయా దేశాలు కలవాలి. నిజానికి సీఐఎస్ ప్రయోగం కూడా విఫలమై…ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. మరో మార్గం కూడా ఉంది. పుతిన్ తరహాలో రాజ్యకాంక్షతో భారత్ యుద్ధాలకు వెళ్లాలి. భారత్ అలా చేసే అవకాశమే లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నందున పాకిస్థాన్ పై
మనం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నామే తప్ప.. మిగతా దేశాలతో మనకు పేచీ లేదు. అందుకే అఖండ్ భారత్ నినాదం చెప్పుకోవడానికే తప్ప…. ఆచరణ అసాధ్యమని తేలిపోయింది. ఇండియాలోని హిందువులను తరచూ రెచ్చగొట్టేందుకు మాత్రమే ఇలాంటి నినాదాలు ఉపయోగపడతాయి… అంతే…