నవంబర్ 5 నుంచి పుష్ప2 షూటింగ్

By KTV Telugu On 1 November, 2022
image

ఇక తగ్గేదేలేదు అంటున్న పుష్పరాజ్
ముందు హైదరాబాద్ తర్వాత బ్యాంకాక్

ప్యాన్ ఇండియా ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప2 షూటింగ్ నవంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. మొదట ఓ చిన్న షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభిస్తారు. ఓ వారం గడిచిన తర్వాత యూనిట్ బ్యాంకాక్ వెళ్లనుంది. అక్కడ దట్టమైన అడవుల్లో సినిమా షూటింగ్ నిర్వహించబోతున్నారు. నెలఖరు వరకు అల్లు అర్జున్,ఇతర తారాగణంపై షూటింగ్ నిర్వహించనున్నాడు సుకుమార్. ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక షెడ్యూల్,మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఇంకో షెడ్యూల్ ఉంది. డిసెంబర్ తో కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేయనున్నాడు సుకుమార్. మొదటి భాగంలో కనిపించిన పాత్రలే సీక్వెల్లోనూ కనిపించబోతున్నాయి. కాకపోతే సీక్వెల్లో సాయి పల్లవి కూడా నటిస్తుందా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెస్స్. పుష్ప పార్ట్ 1 లో బన్ని రైజ్ మాత్రమే చూశారు. సీక్వెల్లోమాత్రం అతని రూలింగ్ చూడబోతున్నారని ఇప్పటికే చెప్పుకొచ్చాడు సుకుమార్. పైగా సెకండ్ పార్ట్ లో మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజల్ విలనీ హైలైట్ గా నిలవబోతోందట.