ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేస్తుంటారు. రాజీవ్ గాంధీ హత్యకు 1991లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దళం సభ్యురాలిని వినియోగించింది. ఆ రెండు సీరియస్ ఇష్యూస్. ఇప్పుడో చిన్నన్న కామెడే చేస్తున్నారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా వంద మంది ఆత్మాహుతి దళ సభ్యులను సిద్ధం చేస్తున్నాడట. పైగా దానికి సూసైడ్ బ్యాచ్ అని పేరు పెట్టేశారాయన. వినడానికి ఎంత బావుందో కదా….
బుద్దా వెంకన్న.. టీడీపీ ఓడిపోయి చాలా రోజులైనా పార్టీలో క్రియాశీలంగానే ఉన్నారు. నెలకు 29 రోజులు పచ్చ చొక్కా మాత్రమే ధరిస్తారు. మీడియా మైకు పెట్టగానే ఆవేశంగా డైలాగులు వదులుతారు. జగన్‌ను తిడుతుంటారు. మొన్నీ మధ్య వైసీపీ ప్రభుత్వం కేసు పెట్టి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అర్థరాత్రి వదిలేసింది. ఇంకేముంది మనం అందరిలాగా కాదు… మనల్ని ఎవరేమీ చేసుకోలేరని డైలాగులు వదిలేశారు. ఆ తర్వాత ఎలాగూ రోజువారీ ప్రెస్ మీట్లు ఉండనే ఉన్నాయనుకోండి..
ఇప్పుడు బుద్దా వెంకన్న కొత్త విషయం చెప్పారు. టీడీపీలో ఆత్మాహుతి దళం సిద్ధమవుతోందట. చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడే వారి భరతం పట్టేందుకే ఈ సూసైడ్ బ్యాచ్ పనిచేస్తుందట. మరి వైసీపీ వాళ్లు ఇకపై నోరు దగ్గర పెట్టుకోవాల్సిందే. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.. ఇంటి నుంచి కదిలేప్పుడు అటు ఇటు చూసి మరీ.. నడవాలి. కొత్తవారు కనిపిస్తే పరిగెత్తిపోయి దాక్కొవాలి. లేకపోతే అంతే సూసైడ్ బ్యాచ్ చూసుకుంటుంది మరి…
అన్నాయ్ ఎవరిని బెదిరిస్తున్నారు…
చంద్రబాబుపై దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటే సహించేది లేదని బుద్దా వెంకన్న స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. సీనియర్లకు కాదని జోగ్ రమేష్‌కు మంత్రి పదవి ఎలా వచ్చిందని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఆయన పరోక్షంగా చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారని నెటిజెన్స్ జోకులేసుకుంటున్నారు. 2024లో పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత తమకు కాకుండా కొత్త వారికి మంత్రి పదవులు ఇస్తే ఊరుకునేది లేదని చంద్రబాబును వెంకన్న హెచ్చరిస్తున్నారట. మరి దేశం అధినేతకు అర్థమవుతుందో లేదో..
సూసైడ్ బ్యాచ్ సరే.. జగన్ బ్యాచ్ సంగతేంటి ?
బుద్దా వెంకన్న కామెంట్స్ ను జగన్ బ్యాచ్ ఇంతవరకు సీరియస్ గా తీసుకున్న దాఖలాలు కనిపించ లేదు. వాళ్లు సీరియస్ గా తీసుకుంటే ఏమవుతుందో ప్రత్యేకంగా మనం చెప్పాలా…. అచ్చెన్నాయుడు, పట్టాభి, చింతమనేని ఎంతమందిని చూడలేదు. ఇక చెప్పుకోవడం ఎందుకులే..ఉంటా….