ఆ ప్లేస్ లో మరో హిస్టారిక్ మూవీ
సూర్య చేయాల్సిన సినిమాలో రణవీర్
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా హిందీ అపరిచితుడు రీమేక్ తెరకెక్కించాలనుకున్నాడు శంకర్. కాని అందుకు అపరిచితుడు నిర్మాత ఒప్పుకోలేదు. దాంతో శంకర్ చేసేది లేక మరో ప్రాజెక్ట్ వైపు దృష్టి పెట్టాడు. శంకర్ మేకింగ్ లో వేల్పరి నవల ఆధారంగా తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నాడు. మొత్తం మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
అయితే వేల్పరి నవల ఆధారంగా తెరకెక్కే చిత్రంలో గతంలో సూర్య పేరు వినిపించింది. ఇప్పుడు హీరో మారిపోవడంతో తమిళనాట ఒకింత అసహనం వ్యక్తమవుతోంది. తమిళ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో తమిళ హీరో నటించాలనేది వారి వాదన. శంకర్ కు తమిళుల సెంటిమెంట్ గురించి బాగా తెలుసు. కాని ఎందుకో బాలీవుడ్ హీరోను తమిళ ప్రఖ్యాత నవలలో నటింపజేయాలనుకుంటున్నాడు. 2024లో ఈ చిత్రం పట్టాలెక్కుంది. ఎందుకంటే రాబోయే ఏడాదికాలం శంకర్ ఇండియన్ 2, రామ్ చరణ్ తో చిత్రాలను తెరకెక్కించడం, విడుదల చేయడం పైనే బిజీగా ఉంటాడు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాతే రణవీర్ సింగ్ తో వేల్పరి నవల ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నాడు.