డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న వసూళ్ల జాతర
అదిరిపోయిన విజువల్స్
2009లో వచ్చిన అవతార్ గురించి ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం,
అది జేమ్స్ కామెరూన్ మాయజాలం. 2009లో విడుదలైన అవతార్ అప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటిని చెరిపేసింది.
ఇప్పుడు 2022లో కూడా అదే జరగనుంది. ఎందుకంటే సీక్వెల్ ట్రైలర్ చూస్తే ఆ రేంజ్ లో ఉంది.
ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లింది. సినిమాపై అంచనాలు పెంచేసింది.
క్రిస్మస్ హాలిడేస్ కు వారం ముందుగానే వరల్డ్ మార్కెట్ లో దాదాపు 150కి దేశాల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది.
హాలీవుడ్ లో మాత్రమే కాదు, ప్యాన్ ఇండియా మార్కెట్ లోనూ ఈ మూవీ సెన్సేషన్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
మొదటి భాగం కథకు కొనసాగింపు కథే కాకపోతే,15 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అనే సీక్వెల్లో చూపించబోతున్నారు.
మొత్తం 3.10 నిముషాల పాటు అవతార్ లోకం లో ప్రేక్షకులు విహరించబోతున్నారు.