తెలంగాణలో బీజేపీ బెంగాల్ ఫార్ములా !?

By KTV Telugu On 18 March, 2022
image

దక్షిణాదిన తాము అధికారం చేపట్టే రెండో రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ పెద్దలకు గట్టి నమ్మకం ఉంది. కానీ అదేమంతచిన్న విషయం కాదు. తేలికైన విషయం కాదు. ఎంతో వ్యూహం ఉండాలి. మరెంతో కసరత్తు చేయాలి. ఎలాచేయాలంటే బెంగాల్ లో తృణమూల్‌పై చేసిన తరహాలో టీఆర్ఎస్‌పై దండెత్తాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతోంది. అలాంటి కార్యాచరణను బీజేపీ రెడీ చేసుకుంటున్నట్లుగా కనిిస్తోంది.

తెలంగాణలో బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ !

బీజేపీకి 2018లో ఉన్నది ఒక్క ఎమ్మెల్యేనే. కానీ ఇప్పుడు ముగ్గురయ్యారు. 2023లో అధికారంలోకి రాాలని టార్గెట్ పెట్టుకున్నారు. యూపీ ఎన్నికల తర్వా తెలంగాణపై కార్యాచరణ ప్రారంభమవుతుందని ముందు నుంచే సంకేతాలున్నాయి. ఈ క్రమంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అమిత్ షా రెండు రోజుల పాటు బీజేపీ అధ్యక్షుడు నడ్డా తెలంగాణలో మకాం వేయనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా రివ్యూ చేసి ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ ఏడాది చివరి నుంచి రాష్ట్రంపై అమిత్ షా పూర్తి టైమ్ వెచ్చించనున్నారు. పార్టీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా తరుణ్ చుగ్ ఉన్నప్పటికీ ఆయన కింద పనిచేసేలా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కన్వీనర్లను కూడా నియమిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారినే ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు.

బెంగాల్‌లో సీపీఎంను నిర్వీర్యం చేసినట్లుగా కాంగ్రెస్‌ను చేసే ప్లాన్ !

ఏడాది చివరి నుంచి వీలైనన్ని ఎక్కువ రోజులు అమిత్ షా తెలంగాణలో గడుపుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు ఇకపైన తరచూ తెలంగాణను విజిట్ చేసి పార్టీ కార్యకలాపాలతో పాటు బహిరంగసభలు, గ్రామాల్లో పర్యటనల్లో పాల్గొనే అవకాశం ఉంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు. బెంగాల్‌లో టీఎంసీతో హోరాహోరీగా పోరాటం వల్ల దశాబ్దాల పాటు అధికారం చేపట్టిన కమ్యూనిస్టులు సైడయిపోయారు. చివరికి వారు కూడా ఓట్ల పరంగా మమతాకు వ్యతిరేకంగా బీజేపీకి మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితినే కాంగ్రెస్‌కు కల్పిచాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామస్థాయి కార్యకర్తల మొదలు రాష్ట్రస్థాయి నాయకుల వరకు చేర్చుకోవడంపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలవారీగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న నాయకులపై దృష్టి పెట్టారు. జేపీ నడ్డా, అమిత్ షా టూర్‌ల తర్వాత పార్టీలో గణనీయమైన మార్పులు జరుగుతాయని, సంస్థాగతంగానూ పార్టీ నిర్మాణం విస్తృతమవుతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్ెస్ నుంచి భారీ చేరికలకు సన్నాహాలు !

టీఆర్ఎస్ కారు ఇప్పటికే ఓవర్ లోడ్ అయింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి చాన్స్ దొరకదనుకున్నవారికి బీజేపీ రూపంలో మంచి ఆప్షన్ ఎదురుగా ఉండటంతో త్వరపడాలనుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం కారణంగా ఇప్పుడు అందరూ రెడీ పోతున్నారు. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు వంటి వారితో చర్చలు పూర్తి చేశారు. మరికొంత మంది సీనయర్ల పేర్లు చర్చకు వస్తున్నాయి. పరిస్థితి ముందుముందు చాలా తీవ్రంగా ఉటుందని బెంగాల్ తరహాలో టీఆర్ఎస్ నుంచి నేతల క్యూ ఉంటుందని చెబుతున్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలూ అడుగు పెట్టే అవకాశం !

ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ వ్యతిరేక పక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ వంతు సాయం చేస్తాయన్న విమర్శలు ఉన్నాయి. అది నిజమో కాదో కానీ.. విపక్ష నేతలపై సీబీఐ,ఐటీ, ఈడీ దాడులు జరుగుతూ ఉంటాయి. బెంగాల్ లోఅయితే మరింత తీవ్రంగా జరిగాయి. అలాంటివే తెలంగాణనూ ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే.. అచ్చంగా బెంగాల్ రాజకీయాలు.. తెలంగాణలో దిగిపోయినట్లవుతుంది. అయితే అలాంటి పరిస్థితే వస్తే మమతా బెనర్జీ ఎదుర్కొన్నట్లుగా టీఆర్ఎస్, కేసీఆర్ ెదుర్కోగలదా అన్నదే సందేహం.