లక్ష్యం 2024 – రాజ్యసభలోనూ సంపూర్ణ మెజార్టీ దిశగా బీజేపీ

By KTV Telugu On 15 May, 2022
image

ఆంగ్లంలో ఒక సామెత ఉంది. Nothing suceeds like success అంటారు. బీజేపీ ఇప్పుడు అదే సామెత అతికినట్లు సరిపోతుంది. పట్టిందల్లా బంగారమవుతోంది. టఫ్ ఫైట్ అనుకున్న రాష్ట్రాల్లోనూ సునాయాసంగా గెలవడం లాంటి పరిణామాలు కమలం పార్టీకి బాగా కలిసొస్తున్నాయి. లోక్ సభలో సంపూర్ణ మెజార్టీ ఉన్న కమలనాథులకు మరో ఏడాదిన్నర కాలంలో రాజ్యసభపైనా పూర్తిగా పట్టు సాధించే అవకాశాలు కనిపినస్తున్నాయి…

తాజా షెడ్యూల్ విడుదల

రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగునున్నాయి. 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఏపీలో టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సురేష్ ప్రభు, విజయసాయి పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ. శ్రీనివాస్ పదవీ కాలం కూడా ముగియబోతోంది. ఏపీలో వైసీపీ మొత్తం నాలుగు స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమే. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా అంతే…..

ఉత్తర ప్రదేశ్ కీలకం
రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న 57 స్థానాల్లో ఉత్తర ప్రదేశ్లో అత్యధికంగా 11 ఉన్నాయి. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా, సమాజ్ వాదీ పార్టీ నేత రోటీ రమణ్ సింగ్ రిటైరవుతున్న వారిలో ఉన్నారు. 403 మంది ఎమ్మెల్యేలున్న యూపీ అసెంబ్లీలో రాజ్యసభ సభ్యుడు గెలిచేందుకు 37 ఓట్లు అవసరం. ప్రస్తుత అసెంబ్లీలో 273 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. దానితో బీజేపీకి కనీసం ఏడు రాజ్యసభ స్థానాలు రావడం ఖాయం. ఎస్పీకి మూడు స్థానాలు రానుండగా, ఇతర పార్టీలను కలుపుకుని నాలుగో స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ఎనిమిదో స్థానం కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం. కపిల్ సిబల్ నిష్క్రమణతో అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానం కూడా లేని దుస్థితి ఏర్పడబోతోంది….

మహారాష్ట్రలో ఆరు ఖాళీలు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ నేత చిదంబరం, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ పదవీ కాలం ముగుస్తోంది. ఆరు ఖాళీల్లో అధికార మహా వికాస్ అగాధీకి నాలుగు స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. రెండు శివసేన ఖాతాలోకి వెళ్లిపోతాయి. కాంగ్రెస్, ఎన్సీపీకి చెరో స్థానం కేటాయించే అవకాశం ఉంది కాంగ్రెస్ స్థానాన్ని తమిళ తంబికి కేటాయిస్తారా లేదా అన్నది మాత్రం చిదంబర రహస్యమే….

బీజేపీకి రాజ్యసభలో పూర్తి మెజార్టీ ?

పార్టీలో చేరిన నామినేటెడ్ సభ్యులతో కలిసి బీజేపీకి ఇప్పుడు వంద మంది రాజ్యసభ సభ్యులున్నారు. కాంగ్రెస్ కు 29 మంది ఉన్నారు. కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు బీజేపీ ప్రస్తుతం ఎన్డీయే కాని, యూపీఏలో లేని ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకుంటోంది. ప్రస్తుతం రిటైర్మెంట్లతో బీజేపీ స్థానాలు తగ్గినా… ఇప్పుడు జరుగుతున్న 57 స్థానాలు, జూలైలో ఖాళీ అయ్యే 33 స్థానాల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ పుంజుకంటే… సొంత బలం సునాయాసంగా వంద దాటుతుంది. ఏడుగురు నామినేటెడ్ సభ్యులు కూడా రిటైరవుతుండగా.. వారి స్థానంలో రాష్ట్రపతి నామినేట్ చేసే వారు కూడా బీజేపీకే మద్దతిస్తారనడంలో సందేహం లేదు. మరో ఏడాది కాలంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన పక్షంలో ఆ పార్టీకి రాజ్యసభ స్థానాలు కూడా పెరగుతాయి అందుకే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొడితే అప్పటికి రాజ్యసభలో కూడా సొంత మెజార్టీ ఖాయమని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు. అప్పుడు బిల్లుల ఆమోదానికి ఎవరి సహకారం తీసుకోవాల్సిన అవసరం