టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న ఆటలో…హస్తం పార్టీ ఇరుక్కుందా ? టీఆర్ఎస్ కు …తామే బలమైన ప్రత్యర్థి అని చెప్పడానికి కాషాయ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తోందా ? ఉప ఎన్నికను…కమలనాథులు సెమీఫైనల్ గా భావిస్తున్నారా ? మునుగోడులో గెలిచి…గులాబీ పార్టీకి వణుకు పుట్టించేలా అస్త్రాలు సిద్ధం చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలను…రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారన్న దానిపై ఆసక్తి రేపుతోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ…అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు…తామే ప్రత్యామ్నాయమనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని డిసైడ్ అయింది. వరుసగా రెండు ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ…ముచ్చట మూడో దాంట్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెల్చుకున్న బిజెపి…ఆ తర్వాత వచ్చిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి….పొలిటికల్ మూడ్‌నే మార్చేసింది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు…తామే ప్రత్యామ్నాయమనే స్ధాయిలో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ… ఆ తర్వాత జరిగిన హుజురాబాద్ లో బంపర్ మెజార్టీతో గెలిచింది. మునుగోడు ఉప ఎన్నికను.. సెమీఫైనల్ గా భావిస్తున్న కమలం పార్టీ…టీఆర్ఎస్ ను మట్టి కరిపించేలా ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికపుడు ఎత్తిచూపడంలో…టీఆర్ఎస్ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో బీజేపీ సక్సెస్ అయింది.
తెలంగాణ కాంగ్రెస్‌కు..ప్రస్తుతం మునుగోడు ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. అధికార పార్టీ.. బీజేపీలు ఎన్నికలు కోరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు మాత్రం ఇప్పుడు ఎన్నికలు వస్తే తలనొప్పి తప్పదనే చర్చ నడుస్తోంది. బరిలో దింపేందుకు బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడంతోపాటు.. డబ్బును సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో… నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అందరూ అనుకున్నట్లు మునుగోడు ఉప ఎన్నిక వస్తే…నల్గొండ నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు పీసీసీ చీఫ్ రేవంత్‌ను రావొద్దని… గతంలో ప్రకటనలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉపఎన్నిక వస్తే ఆ బాధ్యత కూడా అక్కడ ఉన్న నేతలే తీసుకోవాలని రేవంత్ రెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్, బీజేపీ అడుతున్న పొలిటికల్ గేమ్ లో…టీ కాంగ్రెస్ ఇరుక్కుంది. ఆ పార్టీలు ఉప ఎన్నికపై హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ….రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. ప్రజల్లో ఈ రెండు పార్టీల గురించే చర్చించుకునేలా…విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికపై టీఆర్ఎస్, బీజేపీలు…డ్రామాలు ఆడుతున్నాయంటూ…కాంగ్రెస్ నేతలు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. వారి ట్రాప్ లో పడకుండా…ఉప ఎన్నికలకు పార్టీ నేతలు, కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకే…టీఆర్ఎస్, బీజేపీ ఒకర్ని ఒకరు తిట్టుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత…గులాబీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే గాలం వేయాలని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కీలక నేతలను పార్టీలో చేర్చుకొని…వరుస ఉప ఎన్నికలతో టీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేయాలని బీజేపీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలకు…బీజేపీ నాయకత్వం టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.