పుష్ప-2 తర్వాత మళ్లీ జులాయి కాంబినేషన్?
ఈసారి సేఫ్ సైడ్ చూసుకుంటున్న మాటల మాంత్రికుడు?
త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఈ మధ్య వరుసగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మహేష్ కోసం తాను రెడీ చేసిన స్టోరీ, సూపర్ స్టార్ కు నచ్చలేదని ఒక దశలో ఈ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ మహేష్ ఆపేయాలనుకున్నాడని ఈ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అందుకేనేమో త్రివిక్రమ్ తర్వాతి చిత్రాన్ని తనకు కంఫర్ట్ గా ఉండే అల్లు అర్జున్ తో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తోంది. మహేష్ తో త్రివిక్రమ్ కు వేవ్ లెన్త్ కుదరడం లేదు అని బాగా ప్రచారం సాగుతోంది. త్రివిక్రమ్ ను మహేష్ బౌండ్ స్క్రిప్ట్ తో అందుకే తిరిగి రమ్మన్నాడు అట. అంతే కాదు నవంబర్ లో షూటింగ్ కు హాజరయ్యేది లేదు అని తేల్చి చెప్పాడట. పూజా హెగ్డే లెగ్ ఇంజ్యూరీ కూడా ఒక రీజన్. దాంతో డిసెంబర్ లో న్యూ షెడ్యూల్ ను ప్రారంభిస్తారట. వచ్చే దసరాకు మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. 2024లోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈలోపు అల్లు అర్జున్ పుష్ప2 కంప్లీట్ చేయాల్సి ఉంది. రిలీజ్ కావాల్సి ఉంటుంది. ముందు జులాయి, తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురములో సినిమాల తర్వాత వీరిద్దరి నుంచి వచ్చే సినిమా పై తప్పకుండా భారీ అంచనాలు ఉంటాయి.