మునుగోడులో డబ్బుల వరద పారుతోంది. ఉప ఎన్నిక పుణ్యమా అన్ని అక్కడి ప్రజలు లక్షధికారులు కాబోతున్నారు.
ఒక్కో ఓటుకు వెయ్యి కాదు…రెండు వేలు కాదు…సుమారు ఎనభై వేలు…అంటే ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే మూడు లక్షల ఇరవై వేలు వచ్చినట్లే. ఇదంతా ఎవరో చెప్పడం కాదు…ఆయా పార్టీల నేతల నోటి నుంచి వచ్చిన మాటలే ఇవి. బీజేపీలో చేరి కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటుకు 30వేలు ఇవ్వబోతున్నారు అంటూ టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అక్రమంగా లక్ష కోట్లు సంపాదించిన సీఎం కేసిఆర్ ఒక్కో ఓటుకు 40వేలు ఇవ్వబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్ అన్నారు. అంటే టీఆర్‌ఎస్ బీజేపీ ఒక్కో ఓటుకు 70వేలు ఇవ్వబోతున్నారని ఓటర్లు లెక్కలేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తలా ఒక 10వేలు ఇస్తే మొత్తం కలిపి 80 వేలు అవుతుంది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో ఒక్కో ఓటు 10వేలు పలికింది. మునుగోడులో దాని విలువ రెట్టింపు అయినట్లు కనిప్తోంది. ఉప ఎన్నికలో పోటీ చేసే తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆయనకు బీఫారంతోపాటు పార్టీ తరఫున రూ.40 లక్షలు చెక్ అందించారు. ఈ ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి రూ.500 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పారని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్‌లో తనను ఓడించడానికి టీఆర్ఎస్ రూ.600 కోట్లు ఖర్చు చేసిందని.. ప్రభుత్వ పథకాల ద్వారా రూ.4 వేల కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసిఆర్ కు మునుగోడులో గెలవడం ఎంత ముఖ్యమో, తెలంగాణాలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ కూడా అంతే ముఖ్యం. అందుకే డబ్బులు మంచి నీళ్లలాగా ఖర్చు పెట్టడానికి రెండు పార్టీలు వెనకాడడం లేదు.
హుజురాబాద్ ఎన్నికల టైంలో తమకు డబ్బు పంచలేదని ఓటర్లు ధర్నాలు చేశారు. ఇప్పుడు మునుగోడులో ఓటు రేటు బాగా విపరీతంగా పెరిగిపోవడంతో డబ్బు అందనివారు ఇక్కడ కూడా ధర్నాలు చేసే అవకాశం లేకపోలేదు