పదే పదే చంద్రబాబు ముందస్తు పాట…. పోటాపోటీగా నియోజకవర్గాల సమీక్షలు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తగ్గపోరుగా జరిగే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు పోటాపోటీగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ… తమ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావడంతో పాటు 175కు 175 గెలవాలని జగన్ పట్టుదలతో ఉంటే…. ఎలాగైనా ఈసారి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బాబు కసిమీదున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయమున్నందున, పనితీరు మెరుగుపర్చుకోవాలని జగన్ తన ప్రజాప్రతినిథులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పరోక్షంగా ముందస్తుకు వచ్చే ముచ్చటే లేదని చెప్పకనే చెబుతున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం పదే పదే ముందస్తు రాగం పాడుతుండడం ఆసక్తిని రేపుతోంది. సందర్భం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఇదే పాట పాడుతున్నారు. తాజాగా, ఎన్టీఆర్ జిల్లా నేతలతో సమీక్ష సందర్భంగా ఈ ప్రస్తావన తీసుకువచ్చారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, పార్టీని మరింతగా బలోపేతం చేయాలని భావిస్తున్నారు బాబు. అందుకోసం, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి రేపే తన పర్యటన మొదలుపెడుతున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈసందర్భంగా ఆ నియోజకవర్గ నేతలతో భేటీ అయిన చంద్రబాబు … 2023 మే లేదా డిసెంబర్ లోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారట. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని, ఇప్పటి నుంచే ప్రజలతో మమేకం అయ్యేలా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని నేతలకు నిర్దేశించారు. వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రెండు రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చారు బాబు.
ఇప్పటికే చంద్రబాబు మొత్తం 117 నియోజకవర్గాలపై సమీక్ష చేశారు. అక్కడ నేతల పనితీరుతో పాటూ పార్టీ పరిస్థితిపై రిపోర్టుల ఆధారంగా ఆరా తీశారు. కొంతమందిని తమ పనితీరు మార్చుకోవాలని సూచించారు. సిట్టింగ్ లకు మళ్లీ సీట్లు ఇస్తామని ఇదివరకే ప్రకటించారు బాబు. అయితే, పార్టీ బలంగా లేని చోట మార్పులు, చేర్పులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అటు జగన్ కూడా బాబు వ్యూహాలకనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే జగన్ సైన్యం గడపగడపకు వెళ్తోంది. గతంలో గెలిచిన సీట్లతో పాటు…కుప్పం, మంగళగిరి, హిందూపురం, టెక్కలి సహా టీడీపీ బలంగా ఉన్న సిట్టింగ్ స్థానాలపై గురిపెట్టారు జగన్. టెక్కలిలో అచ్చెన్నాయుడిపై తమ అభ్యర్థిని కూడా ప్రకటించారు. మొత్తంగా, 2024 టార్గెట్ గా అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలని జగన్ దూకుడుగా వెళ్తుంటే…బాబు మాత్రం ముందస్తు వ్యూహంతో శ్రేణులను ముందే సమాయత్తం చేస్తూ జగన్ జోరుకు బ్రేకులు వేసే ప్రణాళికలు