రూమర్స్ కు చెక్ పెట్టిన అల్లు శతజయంతి ఉత్సవాలు
ఘనంగా అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం
ఎలా వచ్చిందో తెలియదు, ఎలా మొదలైందో తెలియదు, మొత్తంగా మెగా కాంపౌండ్ నుంచి బన్ని బయటికి వచ్చేశాడని ప్రచారం ప్రారంభమైంది. అందుకు తగ్గట్లే గత రెండేళ్లుగా మెగా హీరోలతో బన్ని కలసి కనిపించలేదు. మెగా ఈవెంట్స్ కు ఐకాన్ రాలేదు. అల వైకుంఠపురములో , పుష్ప ఘన విజయాలను మెగా హీరోలు పెద్దగా పట్టించుకోలేదు. RRR గురించి బన్ని పెద్దగా మాట్లాడలేదు. సో ఎక్కడో గ్యాప్ ఉంది. మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీ దూరమైంది అనేది అందరికి అర్ధమైంది. ఇదే సమయంలో అల్లు అర్జున్ అల్లు బ్రాండ్ ను పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం, తన దారిలో వెళ్తుండటంతో ఎక్కడో ఈ రెండు కుటుంబాలకు చెడింది అనే విషయాన్ని అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టార.
సోషల్ మీడియాలో అయితే మెగాభిమానుల , అల్లు అర్జున్ ఆర్మీ మధ్య ఎప్పుడూ ట్వీట్స్ వార్ జరుగుతూనే ఉంటుంది. బన్ని స్టార్ డమ్ అందుకునే వరకు మెగా భజన చేసాడని, వన్స్ స్టార్ డమ్ అందిరాగానే మెగా ఫ్యామిలీకి కావాలనే దూరం జరిగాడని మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఓపెన్ గానే కామెంట్స్ పెడుతుంటారు. మెగా ఫ్యామిలీ కష్టకాలంలో ఉన్న ప్రతీసారి బన్ని ముందుకొచ్చాడని ఆ విషయాన్ని మర్చిపోవద్దని ఐకాన్ ఆర్మీ గుర్తు చేస్తుంటుంది. ఈ సంగతి ఇలా ఉంటే అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు స్టూడియోస్ ఓపెనింగ్ లోనూ, పుస్తక ఆవిష్కరణలోనూ మెగాహీరోలు , అల్లు హీరోలు కలసి కనిపించారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకే వేదికపై అందరం ఒక్కటే అనే చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చిరు , ఐకాన్ మధ్య ప్రేమలు అనురాగాలు అలాగే ఉన్నాయి.
మొత్తంగా మెగా , అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని అల్లు శతజయంతి ఉత్సవాలు క్లారిటీ ఇచ్చినట్లైంది.
ఇప్పటికైనా మెగాభిమానులు, అల్లు ఆర్మీ మధ్య ట్వీట్స్ వార్ కు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.