పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్…హైదరాబాద్ కు మణిహారంగా నిలవబోతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ అంటే చార్మినార్, సైబర్ టవర్ గుర్తుకు వస్తాయ్. ఆ జాబితాలోకి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చేరబోతోంది. రాష్ట్రంలో ఏ మూలలో ఏం జరిగినా…క్షణాల్లో కంట్రోల్ రూంకు తెలిసిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెమెరా లను పోలీస్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు.
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్… లేటెస్ట్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్. సింపుల్ గా చెప్పాలంటే..పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. రాష్ట్రంలో ఏ మూలలో నేరం జరిగినా..వెంటనే తెలిసిపోతుంది. సింగపూర్, న్యూయార్ నగరాల్లో ఉన్నటు వంటి టెక్నాలజీని పోలీసులకు అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో..ఈ భవనాన్ని నిర్మించారు. కంట్రోల్ రూంలో ఐదు టవర్లు ఉన్నాయ్. 6.42లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఏర్పాటు చేశారు. 83.5మీటర్ల ఎత్తులో కంట్రోల్ రూంను సిద్ధం చేశారు. 2015 నవంబర్ 22 న సెంటర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ముందు 350 కోట్ల అంచనాతో నిర్మించాలని తలచింది. మూడేళ్లలోనే నిర్మాణాన్ని పూర్తి చేయడానికి టార్గెట్ గా పెట్టుకుంది. దీంతో ప్రాజెక్ట్ ఆలస్యం కావటంతో…మరో 2వందల కోట్ల బడ్జెట్ ను పెంచింది ప్రభుత్వం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పూర్తి చేయడానికి…585 కోట్లు ఖర్చు చేసింది తెలంగాణ సర్కార్.
సిటీలో ఉండే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్న విజువల్స్ ను భారీ వీడియో వాల్ సాయంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు. అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే…స్పందించేలా కంప్యూటర్ ప్రొగ్రామింగ్ ఉండనుంది. ప్రత్యేక ఎనలటిక్స్ గా పిలిచే సాఫ్ట్ వేర్స్ తో శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేస్తారు. జీపీఎస్ టెక్నాలజీతో ఉన్న వాహనాలను అవసరమైన చోటుకు మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో లింకు చేశారు. పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్లను విభాగాల వారీగా కేటాయింపు, సత్వర స్పందన, పరిష్కారం, వీటి మ్యాపింగ్ మొత్తం కంప్యూటర్ తోనే జరుగుతుంది. డయల్ 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ… ఇలాంటి వ్యవస్థలన్నీ ఒకే దగ్గర ఉండనున్నాయి. మార్కెట్, సోషల్ మీడియా విశ్లేషణ, మెబైల్ యాప్స్ కంప్లైంట్ల పరిష్కారానికి స్పెషల్ వ్యవస్థ ఉంటుంది.
ప్రస్తుతం బషీర్ బాగ్ లోని పోలీసు కమిషనరేట్… సిటీ ట్రాఫిక్ కమిషనరేట్ గా మారనుంది. హైదరాబాద్ లోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ వంటి అన్ని విభాగాలనూ…కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి తీసుకొచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారులు సమావేశమయ్యేలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులో ఉండనున్నాయ్. ఏడో అంతస్తులో సీఎం, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల చీఫ్ లకు ఛాంబర్లు ఉన్నాయి. కేసులు పరిస్థితి, నేరగాళ డాటా, నేరాలు ఎక్కువ జరిగే ప్రాంతాల మ్యాపింగ్, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ లాబ్ ఇతర టూల్స్ నేరాల నియంత్రణకు ఉపయోగపడనున్నాయ్. డాటా ఎనాలసిస్, అడ్వాన్స్ సెర్చ్ కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు.
హోంమంత్రి, డీజీపీ, ఇతర అధికారులకు వేర్వేరు గా చాంబర్లు ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు. టవర్ సీ లో బహుళ ఏజెన్సీ గదితో పాటు ఆడిటోరియం ఉంది. మరో వైపు టవర్ డీ లో ఇతర విభాగాలు, డేటా సెంటర్ ఉన్నాయ్. పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని పోలీసులు మూడో కన్నుగా భావిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో సమాచారాన్ని చేరవేసేలా టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ భవనాన్ని అనుసంధించారు.