ఖర్గే బిలో 50 ఫార్ములా ఆచరణ సాధ్యమా

By KTV Telugu On 9 November, 2022
image

కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక మార్పులు సాధ్యమా ? తాజా అధ్యక్షుడు మల్లిఖార్దున్ ఖర్గే అలా ఎందుకు అంటున్నారు ? యాభై ఏళ్ల లోపు వారికే సగం సీట్లు ఇవ్వడం అంత సులభమా ? పార్టీలో పాతుకుపోయిన సీనియర్లు ఒప్పుకుంటారా ? ఓ స్టోరీ…

కాంగ్రెస్ ప్రక్షాళనకు ఖర్గే ప్రయత్నాలు
యువతకు, మహిళలకు టికెట్లిస్తామంటున్న కొత్త అధ్యక్షుడు
యాభై శాతం స్థానాలు వారికేనట
కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త చర్చ
సీనియర్లకు టెన్షన్ పుట్టిస్తున్న ఖర్గే ప్రకటన

కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన దిశగా తీసుకెళ్లేందుకు కొత్త అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన ఆలోచనా విధానాన్ని ఆయన స్వరాష్ట్రం కర్ణాటక నుంచే ప్రారంభించే అవకాశం ఉందనిపిస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా పార్టీలో సీనియర్ ఆశావహులకు షాకిచ్చే ప్రకటన చేశారాయన. ఎన్నికల్లో యాభై శాతం టికెట్లు యూత్ కు ఇస్తామన్నారు. యాభై సంవత్సరాల లోపు వారికే సగం సీట్లు కేటాయిస్తామన్నారు. అందులోనూ మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని తేల్చేశారు. ఖర్గే తాజా ప్రకటనతో కర్ణాటక కాంగ్రెస్ లో సీనియర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి.

నెలరోజులుగా ఖర్గే చెబుతున్న మాట ఇదే
పార్టీ పదవుల్లోనూ యాభై శాతం యువతకేనట
పార్టీకి యూత్ దూరమవుతుందున్న అభిప్రాయం
వారిని మళ్లీ కాంగ్రెస్ వైపుకు లాగే ప్రయత్నం

కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఎనభై ఏళ్ల వయసున్న ఖర్గే ఇదే మాట చెబుతున్నారు. ఇకపై పార్టీ పదవుల్లో యాభై శాతం యువకలుు ఉంటారని ఆయన నెల క్రితం ఒక ప్రకటన చేశారు.ఆ ప్రకటన ఆచరణకు రాకముందే. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో యువతకు యాభై శాతం టికెట్లు ఇస్తామంటున్నారు. నిజానికే కేంద్రంలో బీజేపీ అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నీరుగారిపోతోంది. యువత కమలం వైపు చూస్తోందని కాంగ్రెస్ వైపు యువకులు ఆసక్తిగా లేరన్న అభిప్రాయముూ కలుగుతోంది. అందుకే యువశక్తిని కాంగ్రెస్ వైపుకు లాగేందుకు పదవులను ఎరగా వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటిదాకా సీనియర్లదే రాజ్యం
యువతకు అవకాశం ఇవ్వని పెద్దలు
పార్టీ సీనియర్లు ఏమంటున్నారు 

కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి సీనియర్లదే రాజ్యం. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఫార్ములా పండిట్ నెహ్రూ టైమ్ నుంచి ఫెయిలవుతూనే ఉంది. ఇప్పటి వరకు సీనియర్లదే డామినేషన్. ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ ను బయట పడేసేందుకు రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు చివరకు ఆయనే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకున్నారు. జీ-23 అంటూ సీనియర్లు చేసిన హడావుడి ఇంకా ఎవరూ మరిచిపోలేదు. తాజాగా మల్లిఖార్గున్ ఖర్గే చేసిన ప్రతిపాదనకు కర్ణాటకలోనే పూర్తిగా సానుకూలత కనిపించలేదు. నేతల్లో మిశ్రమ స్పందన వచ్చింది. సీనియర్లు లేకపోతే పార్టీకి ఎవరు దిశానిర్దేశం చేస్తారని పెద్దలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. పైగా అంత మంది యూత్ పార్టీలో ఎక్కడున్నారని కొందరు కామెడీలు చేస్తున్నారు.

జాతీయ స్థాయిలో ఖర్గే ఫార్ములా సాధ్యమా
ఖచితంగా పాటిస్తే రేవంత్ రెడ్డి, తులసిరెడ్డికి కూడా కషమే
సచిన్ పైలట్ కు ఒక్క సారే అవకాశం
కఠిన నిర్ణయాలు తప్పవంటున్న కాంగ్రెస్ శ్రేణులు

కర్ణాటక సంగతి సరే. ఇతర రాష్ట్రాల్లో కూడా ఖర్గే ప్రతిపాదించిన బిలో 50 ఫార్ములాను అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ 24 గంటల్లోనే వేగం పుంజుకుంది. ఆ ఫార్ములాను తూచ తప్పకుండా పాటిస్తే రేవంత్ రెడ్డి, తులసిరెడ్డికి టికెట్టివ్వడానికి కూడా ఆలోచించాల్సి రావచ్చు. అంతకుమించి రాజస్థాన్ రెబెల్ లీడర్ సచిన్ పైలట్ కు కూడా ఒక్క సారే అవకాశం వస్తుంది. తర్వాత రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడాయన వయసు 45 దాటుతోంది. అయినా సరే న్యూ ఇయర్ నుంచి పార్టీలో కఠిన నిర్ణయాలు తప్పవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎలాగూ యాభై శాతం సీట్లు కామన్ గా ఉంటాయని. గెలుపు గుర్రాలుగా ఉన్న సీనియర్లకు అందులో చోటు దొరుకుతుందని చెబుతున్నారు. అందుకే యాభై ఏళ్లు దాటినా రాహుల్ గాంధీ సేఫ్ అని చెప్పక తప్పదు.