బంపర్ ఆఫర్ కొట్టేసిన ఉప్పెన డైరెక్టర్
సంగీతం అందిస్తున్న రెహమాన్
శంకర్ తర్వాత రామ్ చరణ్ చేయబోయే దర్శకుడు ఎవరూ అనేది క్లారిటీ వచ్చేసింది.
ఉప్పెనతో 100 కోట్లకు పైగా రాబట్టిన బుచ్చిబాబు మేకింగ్ లోనే రామ్ చరణ్ ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.
ఇదే విషయం క్లారిటీ రానుంది. నిజానికి సుకుమార్ తో మూవీ చేయాలనుకున్నాడు రామ్ చరణ్.
కాని పుష్ప-2 ఇఫ్పుడిప్పుడే సెట్స్ పైకి వెళ్లింది. పైగా సినిమా కంప్లీట్ కావడానికి 2024 వరకు టైమ్ పట్టాలా ఉంది.
అందుకే తారక్ కోసం బుచ్చిబాబు రెడీ చేసిన స్టోరీని ఇప్పుడు చరణ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఓ కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు.
ఏ.ఆర్. రెహమాన్ లేదా దేవిశ్రీ ప్రసాద్ లో ఒకరు సంగీతాన్ని అందించబోతున్నారట.
జనవరి నుంచే షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు బుచ్చిబాబు.