ఉప్పెన దర్శకుడి ఆశల ఆవిరి
స్పోర్ట్స్ మూవీని పక్కన పెట్టిన టైగర్
ఉప్పెన సంచలన విజయం సాధించడం ఆలస్యం ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు వెంటనే ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నట్లు తెలిపాడు. తాను రాసుకున్న లైన్, స్టోరీని డెవలప్ చేసిన విధానం ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. సినిమాకు పెద్ది అనే టైటిల్ అనుకుంటున్నట్లు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు బాగా ప్రచారం సాగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అందుకు సంబంధించి బుబ్బిబాబుకు తారక్ క్లారిటీ ఇచ్చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో బుచ్చిబాబుకు డేట్స్ ఇవ్వడం కుదరని పని అని అందుకే యంగ్ డైరెక్టర్ ను రిలీవ్ చేసేసాడు టైగర్. ఆల్రెడీ బుచ్చిబాబు కూడా తాను రాసుకున్న కథను మరో హీరోతో తెరకెక్కించేందుకు సంప్రదింపులు ప్రారంభించాడట. ఇందులో తారక్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ పేరు కూడా ఉంది. మరో వైపు బుచ్చిబాబుకు ఉప్పెన సీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచన కూడా ఉంది. తారక్ తో చేయాల్సిన సినిమా ఎలాగూ ఆగిపోయింది కాబట్టి బుచ్చిబాబు ఇమిడియెట్ గా ఉప్పెన2 పై ఫోకస్ పెట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన గురువు సుకుమార్ ఆల్రెడీ పుష్ప 2 సీక్వెల్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.