తెలుగు హీరోలు వర్సెస్ తమిళ హీరోలు
ఎవరి టపాసులకు గిరాకీ ఉంటుంది?
దసరాకు బిగ్ స్టార్స్ బరిలోకి దిగారు. చిరు గాడ్ ఫాదర్ గానూ, నాగార్జున ఘోస్ట్ గాను ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
దసరా పండక్కి కావాల్సినంత వినోదాన్ని అందించారు. దసరాకు ఎలాగూ అగ్రహీరోలు పోటీ పడ్డారు.
దీపావళికి మాత్రం యంగ్ హీరోస్ మధ్య పెద్ద పోటీ జరగబోతోంది. తెలుగు హీరోలు ఒక వైపు తమిళ హీరోలు మరో వైపు,
పటాసుల పండక్కి సై అంటే సై అంటున్నారు. అక్టోబర్ 21న జిన్నా పేరుతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు మంచు విష్ణు.
జిన్నాతో పాటు ఓరి దేవుడా కూడా విడుదలకు ముస్తాబవుతోంది. లాస్ట్ ఇయర్ మోసగాళ్లు తర్వాత మంచు హీరో నటిస్తున్న జిన్నాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరో వైపు ఓరి దేవుడా సినిమా తమిళంలో సూపర్ హిట్టైన ఓ మై కడవులే సినిమాకు అఫీసియల్ రీమేక్. విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. అంతో ఇంతో బజ్ ఉన్న జిన్నా, ఓ దేవుడా సినిమాల వసూళ్లకు గండి కొట్టేందుకు, తమిళం నుంచి కార్తి సర్దార్ గానూ, మరో హీరో శివకార్తికేయన్ ప్రిన్స్ గాను మన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీటిల్లో శివకార్తికేయన్ నటించే ప్రిన్స్ నిజానికి తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తున్నాడు. జాతిరత్నాలు తర్వాత అతను డైరెక్ట్ చేస్తున్న తెలుగు,తమిళ బైలింగువల్ మూవీ ఇది. సో జిన్నా, ఓరి దేవుడా సినిమాలకు అటు సర్దార్ నుంచి, ఇటు ప్రిన్స్ నుంచి గట్టి పోటీనే ఎదురు కానుంది. దీపావళి పండక్కి ఇంకా సమయం ఉండటంతో, రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు ఫెస్టివల్ కు పోటీ పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.