– పొరపాట్న ఇక్కడ పుట్టిందిగానీ పోర్న్ డైరెక్టర్ రేంజ్!
– అరె ఏమిటి లోకం.. పలు కాకుల లోకం..డోంట్ కేర్!
పొరపాటున ఎక్కడో తేడాగొట్టి తనిక్కడ పుట్టిందిగానీ మినిమం హాలీవుడ్లో ఉండాల్సిన టైపు. కాస్త ఛాన్స్ ఇవ్వాలేగానీ నెట్‌ఫ్లిక్స్‌ల సిరీస్‌లు కూడా ఆమె టాలెంట్ముందు తీసికట్టు. చేతనైన ఆ మాత్రం యాక్టింగ్‌తోనే జితేంద్ర సూపర్‌స్టార్ అయ్యాడు. కొడుకు హీరోగా చేయబోయి చివరికి కామెడీ పీస్ అయ్యాడు. ఇక కూతురుందే.. తన టాలెంట్‌కి ఆకాశమే హద్దు. సీరియల్స్ ప్రొడ్యూసర్‌గానే కాదు తన మార్క్ సిరీస్‌లతో అదరగొట్టేస్తోంది. కొందరిని బెదరగొట్టేస్తోంది.
ఎస్..మనం మాట్లాడుకునేది ఏక్తాకపూర్ గురించే. తను మహిళ అయినా కంటెంట్‌లో ఏ హద్దులూ ఉండకూడదని కోరుకునే ‘అభ్యుదయ’వాది. ఆమె ఏం తీసినా న’బూతో’ న భవిష్యత్తే. పక్కా ప్రాక్టికల్. అది బాగోదు ఇది బాగోదని ఫీలవ్వడం తన ఇంటావంటా లేదు. అంందుకే ట్రిపుల్ ఎక్స్ వెబ్సిరీస్ని అడల్ట్ స్టార్స్ కూడా సిగ్గుపడేలా తీసేసింది. ఏ హాలీవుడ్‌లోనే అయితే తన టాలెంట్‌ని వన్స్‌మోర్ అనేవాళ్లేమో. సంప్రదాయబంధనాలు పూర్తిగా వీడని దేశంలో ఉంది కదా. అందుకే ఇన్ని అభ్యంతరాలు..అక్షింతలు.
ఏక్తాకపూర్ XXX సిరీస్‌ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అభ్యంతరకరమైన కంటెంట్‌తో యువత మనసుల్ని ఏక్తా కలుషితం చేస్తోందని సుప్రీం కన్నెర్ర చేసింది. మీరు ప్రజలకు ఎలాంటి కంటెంట్ అందిస్తున్నారని జడ్జీలు ఏక్తాని ప్రశ్నించారు. XXX వెబ్‌సిరీస్ కంటెంట్‌పై ఏక్తాకపూర్కి అరెస్ట్వారెంట్ జారీఅయింది. దీన్ని సవాలు చేస్తూ ఏక్తా వేసిన పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.
ట్రిపుల్ ఎక్స్ విషయంలోనే కాదు ఏక్తా ప్రతీ ప్రాజెక్ట్ బోల్డ్‌గానే ఉంటుంది. నగ్నత్వం లేకుండా ఆమె సిన్మానే ఉండదు. టీవీరంగంలో సీరియల్స్‌తో ఎందరికో ఉపాధి కల్పిస్తోంది ఏక్తాకపూర్. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో అత్యుత్తమ ప్రతిభకు ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది. ప్రొడ్యూసర్‌గా వరస ప్రాజెక్టులు చేస్తున్న ఏక్తా సక్సెస్‌లో దూసుకెళ్తోంది. విమర్శల్ని ఒంటిమీద దుమ్ములా దులిపేసుకుంటుంది. ఇప్పుడు కోర్టు కేసుల్ని కూడా అలాగే ఫేస్ చేస్తానంటోంది. ఇప్పుడు సుప్రీం చీవాట్లతో మసాలా కాస్తన్నా తగ్గిస్తుందో, తగ్గేదేలే అంటుందో చూడాలి.