ఇప్పటి వరకు సినిమాలు, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. కాక పోతె ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు రోజా.. అదేంటో చూద్దాం పదండి…
రాజకీయ రంగమైనా సినిమా రంగమైనా ఏ రంగమైనా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఆర్ కె రోజా. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదొర్కొన్నా.. ఇప్పుడు పరిపూర్ణమైన రాజకీయ నేతగా అవతరించబోతున్నారు నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా.
ఇప్పటి నుండి ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటానని, ఇక మీదట సినిమాలు, జబర్దస్త్ కు దూరంగా ఉండనున్నట్లు స్వయం ఆమె ప్రకటించారు.
జగనన్న ఇచ్చిన బాధ్యతకి ఎంతో క్రుతగ్నతతో పనిచేయాలనుందని అయితే ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు, ప్రజా సేవకే అంకితం కావాలనుకుంటున్నట్లు మంత్రి రోజా చెప్పుకొచ్చారు.
మంత్రి పదవి అప్పగింత తో సీఎం జగన్ పై అభిమానం రెట్టింపయిందని సమర్థవంతంగా పని చేయడానికి తాను కంకణ బద్ధున్ని అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సినిమా హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఆమె వెలుగొందారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీలోకి మారిన తర్వాత కానీ ప్రత్యర్థులపై ఆమె విరుచుకు పడిన తీరు ఒక రేంజ్ లో ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజా… పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖను కేటాయించినా సమర్థవంతంగా పని చేస్తానని తెలిపారు. మంత్రిగా తన పూర్తి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని… ఈ సమయంలో సినిమాలు, షోలకు సమయం కేటాయించలేనని ఆమె తెలిపారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు.
అయితే అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మద్యంపై ఎంతో పోరాటం చేసిన రోజా.. వైసీపీలోకి వెళ్లిన తర్వాత మద్యంపై ఏనాడు మాట్లాడిన దాఖలాలు కనపబడలేదు. మరి ఇప్పుడు మంత్రిగా బాధ్యతు స్వీకరించాక ఈ అంశంపై ఎలా స్పందిస్తారో.. అస్సలు పట్టించుకోరో చూడాలి. ఏది ఏమైన తనకంటూ ఏపదవి లేనప్పుడు తన గొంతును ఘాటున వినిపించిన నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. మరి ఇప్పుడు క్యాబినేట్ హోదాలో తన స్వరాన్ని ఎలా ఉపయోగిస్తారు.. ప్రతిపక్షాలకు ఎలాంటి చురకలంటిస్తారు.. ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు అనేది తన ముందున్న అతి పెద్ద అంశం.. వీటిన్నింటిని ఎలా బాలెన్స్ చేసుకుని ముందుకెళ్తారో రానున్న రోజుల్లో రోజా ఎలా ఉండబోతోందో మనమూ చూద్దాం…
వికీపీడియాలో హోం మంత్రిగా ఆర్ కె రోజా
ఆదిలోనే అంశపాదు.. అన్న చందంగా తయారైంది ఇప్పుడు ఎమ్మెల్యే రోజా.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా కొద్ది గంటల వ్యవధిలోనే ఆమె ట్రోల్స్ మొదలయ్యాయి. వికిపీడియాలో ఆమెకు హోం మంత్రి పదవి అప్పగించినట్లు పోస్ట్ భయటకొచ్చింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవడం ఒకటైతె. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్ లో మాత్రం మంత్రులందరికీ శాఖలను కేటాయించి వివరాలను పొందుపరిచారు. అయితే ఆర్ కె రోజాకి టూరిజం, కల్చరల్ మరియు యూత్ అడ్వాన్స్ మెంట్ శాఖను కేటాయించినట్లు వెబ్ సైట్ లో మెన్సన్ చేశారు.