విదేశీ ఇన్వెస్టర్లు వెళ్లిపోతే జరిగేది ఇదే…..

By KTV Telugu On 4 July, 2022
image

ఆర్థికంగా దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోనుందా.. మోదీ సర్కారు చెబుతున్న అభివృద్ధి అంతా డొల్లతనమేనా… ద్రవ్యోల్బణం పెరిగిపోవడం , విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం దేనికి సంకేతం. దిగుమతులకు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందా….

భారత్ కు నిధుల కష్టాలు తప్పేలా లేవు. ఖజానా క్రమంగా ఖాళీ అవుతుందన్న భయం కలుగుతోంది. ప్రస్తుతం మన దగ్గర 59 వేల 640 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఉంది. అంటే 46 లక్షల 48 వేల కోట్ల రూపాయలన్నమాట.మార్చి, ఏప్రిల్ నెలలో ఐదు వారాల పాటు తగ్గతూ వచ్చిన మారకద్రవ్యం.. ఇప్పుడు జూన్లో మళ్లీ మూడు వారాలు తగ్గింది.

ఫోరెక్స్ నిల్వలు తగ్గుతున్న కారణంగా ఇతర అంశాల్లోనూ మనం వెనుకబడిపోతున్నాయి. రూపాయి విలువ కూడా పడిపోతోంది. ప్రస్తుతం మనం ఒక డాలర్ కు 78 రూపాయలుపైగా సమర్పంచుకుంటేనే మనకు ఎక్స్ఛేంజ్ సాధ్యమవుతోంది. మరో పక్క మన దేశంలో ఇటీవల ఏడు కోట్ల 80 లక్షల రూపాయలకు సమానమైన బంగారం తరిగిపోయింది. బంగారంపై ఈ పరిణామంతో ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా భవిష్యత్తులో కష్టకాలం తప్పదు. మనం ఎగుమతులు చేసే దేశాలు కోరితే అనివార్యంగా బంగారం రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…

భారత్ లో పెట్టుబడులు పెట్టేవారు తగ్గిపోతున్నారు. పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టిన డబ్బులు తీసుకుంటున్నారు. ముడి చమురు దిగుమతి ధర ఇప్పుడు 120 డాలర్లకు చేరుకుంది. మన దిగుమతి వ్యయంలో 32 శాతం చమురుకే వ్యయం చేయాల్సిన తరుణంలో విదేశీ మారక ద్రవ్యం మొత్తం ఖాళీ అవుతోందని ఆర్థిక వెత్తలు గగ్గోలు పెడుతున్నారు.

విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతూ ఉంటే దాని ప్రభావం పారిశ్రామికిరంగంపై కూడా పడుతుంది.
చమురు, బొగ్గు దిగుమతులు, మెటల్స్, ఖనిజాలు, పారిశ్రామిక మాధ్యమిక ఉత్పత్తుల వ్యయాలు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, బంగారం ధరలు కాస్త తగ్గే పరిస్థితి ఏర్పడినా రూపాయి విలువ క్షీణత కారణంగా వాటి ప్రత్యక్ష ప్రయోజనం సగటు వినియోగదారుడికి చేరే అవకాశం ఉండదు.
వినిమయ రేటులో ఏర్పడుతున్న ఒడిదుడుకుల కారణంగా విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది.

ఫోరెక్స్ రిజర్వ్స్ తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది లేకుండా చూడాలంటే బహుముఖ చర్యలు అనివార్యం. రిజర్వ్ ఆస్తులు, నిధులను అమితవేగంగా విదేశీ కరెన్సీగా మార్చి వాటితో దిగుమతులను ప్రోత్సహించే మెకానిజం రూపొందించుకోవాలి. మనం ఎగుమతి చేయగల వస్తువులను బేరీజు వేసుకుంటూ వాటి పరిమాణం పెంచడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఎగుమతుల్లో 15 నుంచి 20 శాతం వృద్ధి సాధించగలగాలి. వీలైనంత వరకు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి. ఎన్ఆర్ఐ డిపాజిట్లు పెరిగితే బాగానే ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి అదనపు కేటాయింపుల కోసం ప్రయత్నించాలి. మధ్యకాలిక ప్రాతిపదికన తీసుకునే విదేశీ రుణాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి

విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం మామూలు విషయం కాదు… అసలే భారత ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. ద్రవ్యోల్బణం పరిధులు దాటే లోపే సత్వర్య చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఏలిన వారు గుర్తించాలి. అలా చేస్తారో లేదో చూడాలి