డిజాస్టర్ డైరెక్టర్ కు కొత్త సినిమా ఛాన్స్?
ఆశ్చర్యపోతున్న మెగా ఫ్యాన్స్
దసరా సినిమాల్లో గాడ్ ఫాదర్ బంపర్ వసూళ్లతో దూసుకుపోతోంది. కమ్ బ్యాక్ తర్వాత చిరు చిత్రాల్లో బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటోంది. తొలి రోజే 38 కోట్లు రాబట్టిన ఈ సినిమా వీకెండ్ కు 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
గాడ్ ఫాదర్ సూపర్ సక్సెస్ కావడంతో చిరులో కొత్త ఉత్సాహం మొదలైంది. కొత్త సినిమాలను వేగంగా పూర్తి చేసి విడుదల చేయాలనే తపన పెరిగింది. అందుకే దీపావళికి వాల్తేరు వీరయ్యకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాడట.
అంతే కాదు నెక్ట్స్ ఇయర్ తాను చేయాల్సిన సినిమాల లిస్ట్ లోకి ఆటో జానీ చేరిందని సమాచారం. పూరి జగన్నాథ్ తో చిరు చేయాల్సిన 150వ చిత్రం ఆటో జాని. కాని ఈ సినిమా సెకండాఫ్ నచ్చని కారణంగా చిరు ఆటో జాని ప్రాజెక్ట్ పక్కన పెట్టి,
ఖైదీ నంబర్ 150కి ఓటేశాడు. ఇదంతా గతం ఇప్పుడు చిరుకు ఆటో జాని పై మళ్లీ ప్రేమ చిగురించింది. అందుకే పూరితో ఈ మూవీని పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. పూరి గాడ్ ఫాదర్ మూవీలో కీలకమైన పాత్రలో నటించి మెప్పించాడు. అంతా బాగానే ఉన్న పూర్తిగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న పూరికి మెగాస్టార్ మెగా ఆఫర్ ఇస్తాడా అనేది మాత్రం డౌట్ గానే ఉంది. కాని ఫేడ్ అవుట్ అయిపోయిన మెహర్ రమేష్ కు భోళాశంకర్ తీసే అవకాశం ఇస్తున్నప్పుడు కేవలం ఫామ్ కోల్పోయిన డ్యాషింగ్ డైరెక్టర్ పూరికి చిరు తప్పక అవకాశం ఇస్తాడంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. లైగర్ తర్వాత పూరి ప్రస్తుతం కొత్త కథ రాసుకుంటున్నాడు. వన్స్ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత ఇమిడియెట్ గా న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆటో జానికి నెక్ట్స్ ఇయర్ ముహూర్తం కుదిరేలా ఉన్నాయి.