హైదరాబాద్లో జరగుతున్న కీలకమైన షెడ్యూల్
త్వరలో తమిళ రీమేక్ షూట్ ప్రారంభం
పొలిటికల్ ఫీల్డ్ లోనూ, షూటింగ్ స్పాట్ లోనూ పవన్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు వైసీపీని పై విరుచుకుపడుతూనే,
మరో వైపు కూల్ గా హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్, ప్రస్తుతం జరుగుతోంది. యుద్ధం నేపథ్యంలో జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయాలని ప్రయత్నాల్లో ఉన్నాడు పవన్. ఎందుకంటే మిగితా స్టార్ట్ డేట్స్ సర్దుబాటు చేయడం యూనిట్ కు ఇబ్బంది కరంగా మారుతోంది.
ఇప్పటికే విలన్ రోల్ చేయాల్సిన అర్జున్ రామ్ పాల్ తప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన స్థానంలో మరో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటిస్తున్నాడని సమాచారం. వీరమల్లు పూర్తైతే కనుక తమిళ రీమేక్ వినోదయా సిత్తం ను స్టార్ట్ చేసే యోచనలో ఉన్నాడు పవన్. టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమచారం ప్రకారం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ భవదీయుడు భగత్ సింగ్ కాకుండా మరో మూవీ చేయాలనుకుంటున్నాడట.