1. దివంగత భూమా దంపతులకు చెడ్డపేరు తేవద్దని వార్నింగ్
2. అఖిల ప్రియ గ్యాంగును తరిమి కొడతాం
దివంగత భూమా నాగిరెడ్డి, శోభ దంపతులకు ఆళ్లగడ్డ ప్రజల్లో ఎంతో పేరుండేది. ఇప్పుడా పేరు, గౌరవం మట్టి కొట్టుకుపోయాయి. దానికి కారణం ఆ కుటుంబ సభ్యులే అంటే నమ్మబుద్ది కాదు. బ్యాంకులోను ఎగ్గొట్టడంతో పాటు, వేల కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకోవాలనే ఆశతో దివంగత భూమా దంపతులపై చీటింగ్ కేసు పెట్టారు ఆ కుటుంబ సభ్యులు.
2011, డిసెంబర్‌లో భూమా నాగిరెడ్డి నంద్యాల ఆంధ్రాబ్రాంక్‌లో లోన్ తీసుకున్నారు. ఆయన బతికున్నన్ని రోజులు నెలనెలా కిస్తీలు చెల్లించారు. అయితే 2014లో శోభమ్మ, ఆ తర్వాత నాగిరెడ్డి అర్ధాంతరంగా లోకాన్ని విడిచి వెళ్లారు. ఆ తరువాత నుంచి బ్యాంకులకు ఆయన వారసులు కిస్తీలు చెల్లించలేదు. ఫలితంగా లోను మొత్తం వడ్డీతో కలిపి సుమారు 19 కోట్లకు చేరింది. దీంతో లోను కోసం తాకట్టు పెట్టిన ఆస్తుల్ని వేలం వేలం వేయబోతున్నట్లు బ్యాంక్ అధికారులు అఖిలప్రియ ఇతర కుటుంబ సభ్యులకు ఫైనల్ నోటీసులు పంపించారు. అయితే బ్యాంకు తనఖాలో ఉన్న భూమిని 2011 ఆగస్టులో భూమా నాగిరెడ్డి దంపతులు తనకు 45 లక్షలకు విక్రయించారని, డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించకుండా మోసగించారని గుంటూరుకు చెందిన మాదాల వెంకట రామయ్య అనే వ్యక్తి భూమా నాగిరెడ్డి దంపతులతో పాటు అఖిలప్రియ, ఆమె చెల్లి నాగ మౌనిక, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు వెనకాల భూమా అఖిల ప్రయ హస్తం ఉందని కుటుంబ సభ్యులే చెప్పుకుంటున్నారు. ఈ తతంగంపై అఖిలప్రయిన సోదరుడు
భూమా కిషోర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ఎదుగుదల కోసం తల్లిదండ్రులకు చెడ్డపేరు తేవడం బాధాకరం అన్నారు. అఖిలప్రియ చేసే వ్యవహారాల వల్ల భూమా కార్యకర్తలు, అభిమానులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని అఖిలప్రియ భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి వల్లే ఎమ్మెల్యే, మంత్రి అయ్యిందన్నారు.
ఈ కేసును వెంటనే కేసు వెనక్కి తీసుకోకపోతే భూమా అభిమానులే ఆళ్లగడ్డ నడిబొడ్డున ఈడ్చి కొట్టాల్సింది వస్తుంది అని భూమా కుటుంబ సభ్యులను హెచ్చరించారు.