మళ్లీ రంగంలోకి బ్లాక్ మెయిల్ బ్యాచ్

By KTV Telugu On 11 November, 2024
image

KTV TELUGU :-

తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవడం రాజకీయ నాయకులకు చాలా అవసరం. చేసిన తప్పు మళ్లీ చేయనోడే రాజకీయాల్లో రాణిస్తారంటారు. మన తెలుగు రాజకీయ నాయకులు మాత్రం చేసిన తప్పులను పదే పదే చేస్తున్నారనిపిస్తుంది. వాళ్లను వాళ్లు అలాంటి దుస్థితిలోకి నెట్టుకుంటున్నారు. తనకు తాను మోనార్క్ గా భావించే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్షంలోకి దిగిపోయిన తర్వాత కూడా అతి పెద్ద తప్పు చేస్తున్నారు.. వ్యూహకర్తలుగా ఐ ప్యాక్ టీమును ఆయన మB్వీ నియమించుకుంటున్నారు. అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలుస్తుంది…

ఐ ప్యాక్ టీమ్ తో జగన్ రెడ్డి చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చే నాలుగేళ్ల కాలం వరకు ఆ టీమ్ జగన్ రెడ్డి కోసం పనిచేస్తుంది. నెలకు రెండు కోట్ల చొప్పున ఏడాదికి 24 కోట్లు చెల్లించేందుకు జగన్ రెడ్డి ఒప్పుకున్నట్లుగా సమాచారం. అంటే నాలుగేళ్ల కాలంలో ఐ ప్యాక్ టీమ్ ఖర్చు వంద కోట్లు దాటుతుంది. ఐ ప్యాక్ హెడ్ రిషి రాజ్ సింగ్ నేరుగా రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఈ సారి హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ నుంచి ఆపరేట్ చేయబోతున్న ఐ ప్యాక్ టీమ్… డ్యామేజ్ అయిన వైసీపీ ఇమేజ్ ను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తప్పిదాలను గుర్తించి ఎప్పటికప్పుడు ఎక్స్ పోజ్ చేస్తుంది. జగన్ రెడ్డి స్పీచుకు కావాల్సిన మసాలాను అందిస్తుంది. జగన్ కూడా ఐ ప్యాక్ తో తనకు మంచి కెమిస్ట్రీ కుదిరిందని భావిస్తున్నారు. అందుకే కొత్త వారిని పెట్టుకుని ప్రయోగాలు చేసే కంటే ఐ ప్యాక్ తోనే సర్దుకుపోతే బావుంటుందని భావించి అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి క్లయింట్స్ లేని ఐ ప్యాక్ పెద్దలు.. కొత్త వ్యూహాలతో జగన్ ముందుకు వచ్చారు. అవి నచ్చడంతో ఐ ప్యాక్ ను హైర్ చేసుకునేందుకు జగన్ రెడ్డి అంగీకరించినట్లుగా అంతరంగికులు చెబుతున్నారు..

నిజానికి గత రెండు మూడు సంవత్సరాలు ఐ ప్యాక్ తీరు బాగోలేదని వార్తలు వచ్చాయి. వ్యూహాల్లో పూర్తిగా విఫలమైన ఐ ప్యాక్… క్షేత్రస్థాయి పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ కాలేకపోయింది. నియోజకవర్గాల స్థాయిలో చాలా అంశాలను మేనిపులేట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఐ ప్యాక్ ప్రతినిధులు కలెక్షన్ కింగులుగా మారి వైసీపీ వారిని దోచుకున్నారని, పార్టీ అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని పార్టీలో చర్చ జరిగింది. అందుకే దాదాపు అన్ని చోట్ల ఓడిపోయిన వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది.దాన్ని ఐ ప్యాక్ కాదు… మనీ ప్యాక్ అని వైసీపీ నేతలే చెప్పుకునే వారు…

ఐ ప్యాక్ మోడస్ ఆపరేండీపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతీ నియోజకవర్గంలో ఒక నేతను పట్టుకుని పారలల్ గా ఆయనకు వ్యూహాలు సిద్ధం చేస్తామని చెప్పేవారు. ఐ ప్యాక్ ఉద్యోగులు……. కొందరు నేతలతో ప్రైవేటుగా మాట్లాడుకుని ఆయనకు వైసీపీ అధిష్టానం వద్ద ఇమేజ్ పెంచుతామని హామీ ఇచ్చే వారు. ఆ క్రమంలో కోటి, రెండు కోట్లు వసూలు చేసుకుని… అసలు నివేదికలు తారుమారు చేసే వారని ఆరోపణలున్నాయి. అందుకే వైసీపీలో నిజమైన ప్రజాబలం ఉన్న నాయకులెవ్వరో జగన్ దృష్టికి వెళ్లలేదట. వాపును చూసి బలుపు అనుకుని భ్రమపడిన జగన్ చివరకు ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే టీమును ఆయన నమ్ముకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి..

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి