వర్షం కారణంగా థర్డ్ మ్యాచ్ టై
1-0 ఆధిక్యంతో సిరీస్ భారత్ వశం
పంత్ మరోసారి ఫెయిల్యూర్
హార్థిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై టీ 20 సిరీస్ గెలుచుకుంది. మూడో మ్యాచ్ టైగా ముగియడంతో 1-0 ఆధిక్యంతో సిరీస్ సొంతం చేసుకుంది. నేపియర్ వేదికగా జరిగిన మూడో టీ 20 వర్షం కారణంగా మధ్యలో నిలిచిపోయింది. టీమిండియా 9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసిన సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఎంతకీ వెలియకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి వర్తింపజేశారు. అప్పటికి ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. దాంతో మ్యాచ్ టై అయినట్టు రిఫరీ ప్రకటించారు. ఈ ఫలితం టీమిండియాకు లాభించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 19.4ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో కాన్వే, ఫిలిప్స్‌లు అర్థశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, అర్షదీప్ చెరో 4 వికెట్లు తీశారు. సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించగా పరుగులు వీరుడు సూర్యకుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నారు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయి టైగా ముగియడం భారత్ టీ 20 చరిత్రలో ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా మూడవది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయిపోగా, రెండో మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది
ఇక, ఈసిరీస్‌లో మరోసారి రిషబ్ పంత్ విఫలమయ్యాడు. వరల్డ్ కప్‌లోనూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన పంత్ తాజా టీ 20లోనూ సత్తా చాటలేకపోయాడు. దీంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. పంత్ కంటే బెటర్ ప్లేయర్ సంజు శాంసన్‌ను ఎందుకు పక్కనబెడుతున్నారని పైర్ అవుతున్నారు. ఇక న్యూజిలాండ్‌తో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ ఈనెల 25 నుంచి ప్రాంరంభం కానుంది. శిఖర్ ధావన్ వన్డే సిరీస్ కు నాయకత్వం వహించనున్నాడు.