అనుకున్నంతా అయిందా?

By KTV Telugu On 25 October, 2022
image

సంక్రాంతికి అఖిల్ అందుకే వస్తున్నాడా?
ప్రభాస్ అంటే భయం పోయిందా?

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఎదురెళ్లే సాహసం ఎవరు చేయరు. సాహో, రాధే శ్యామ్ ప్లాప్ అయినప్పటికీ ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి. ప్యాన్ ఇండియా వైడ్ గా ఇప్పటికీ ప్రభాస్ బలంగా ఉన్నాడు. ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా పడితే, ఇండియా బాక్సాఫీస్ కు బాహుబలి రోజులను గుర్తు చేస్తానంటున్నాడు ప్రభాస్. కాని ప్రభాస్ బాహుబలి రిలీజ్ డేస్ ను తిరిగి తీసుకురావాలంటే అది బాహుబలి లాంటి సినిమా అయి ఉండాలని, ఆదిపురుష్ మాత్రం కాదు అంటున్నారు ఇతర హీరోలు.
ఇంతకీ ఎవరా హీరోలు అంటున్నారా… ? మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలయ్య, తమిళ హీరో విజయ్, అక్కినేని హీరో అఖిల్. వీరెవరికీ ప్రభాస్ అంటే భయం లేదట. అందుకే ఎప్పుడో సంక్రాంతి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆదిపురుష్ కు పోటీగా, చిరు వాల్తేరు వీరయ్యగానూ, బాలయ్య వీరసింహారెడ్డి గానూ, విజయ్ వారసుడు గానూ, అఖిల్ ఏజెంట్ గానూ,
దిగుతున్నారు. చిరు, బాలయ్య, విజయ్ ముందు నుంచి ఆదిపురుష్ తో పోటీకి సై అనే అంటున్నారు. కాని అఖిల్ కూడా చివరి నిముషంలో బరిలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ కు ఎదురెల్ే. సాహసం అఖిల్ చేయడు. కాని,
సంక్రాంతికి అస్సలు ప్రభాస్ రాకపోతే అఖిల్ రావచ్చు కదా.. అదన్నమ్మాట అసలు విషయం. సంక్రాంతి బరిలో నుంచి ఆదిపురుష్ తప్పుకోవడం కన్ ఫామ్ గా కనిపిస్తోంది. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ కావాలి. సంక్రాంతి సమయంలో అయితే ఆదిపురుష్ డిమాండ్ చేస్తున్న థియేటర్స్ దొరకవు. అందుకే జనవరి 6న లేదా జనవరి 26న ఆదిపురుష్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ విషయం తెలిసే అఖిల్ కూడా ఏజెంట్ ను సంక్రాంతి బరిలో దిగాలని ఫిక్స్ అయ్యాడట.