ఢిల్లీలో లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాత, అందులో వైసీపీ టీఆర్ఎస్ నేతల పేర్లు ఉన్నాయని నిఘా వర్గాలు ప్రకటించాక జగన్ ఢిల్లీ టూర్ లో ఏం జరిగింది ? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ సాగిన జగన్ – కేసీఆర్ బంధానికి ఇక తెరపడబోతోందా ? మోడీతో సమావేశం తర్వాత జగన్ రియాక్షన్ ను బట్టీ, బీజేపీ ఇన్ సైడ్ సోర్సెస్ చెబుతున్న ప్రకారం… గేమ్ స్టార్ట్ అయినట్టే ఉంది ! జగన్ కేసీఆర్ మధ్య లింక్ తెగితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఎలా మారొచ్చో… K TV స్పెషల్ అనాలిసిస్ లో చూద్దాం.
2018 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి ప్రచారం చేశాక కేసీఆర్ గేరు మార్చారు. తెలంగాణలో గెలిచాక, తర్వాత ఐదు నెలలూ ఆంధ్రాలో బాబును ఓఢగొట్టందుకు ఎత్తుగడలు వేయడం రెండు రాష్ట్రాలకూ తెలుసు. వైసీపి సహకరించడం, ఆర్థికంగా కూడా ఆదుకోవడంపైన కూడా రెండు పార్టీలూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయ్. అప్పట్లో బీజేపీ కూడా జగన్ కే సహకరిస్తూ ఉన్న రోజులు కాబట్టి… మూడు పార్టీలూ యాంటీ చంద్రబాబు స్టాండ్ లో ఉన్నాయ్. కానీ ఇప్పుడు సినిమా మారింది.
ఇది ఇఫ్పుడు సినారియో ! నాలుగేళ్ల కిందట ఒకే అజెండాతో పని చేసిన మూడు పార్టీల్లోనూ ఇప్పుడు రాజకీయ విరోధం ముదిరిపోయింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయిపోయింది. నడి మధ్యలో జగన్ ఇరుక్కున్నట్టు అయింది. వైసీపీ ఎంపీకి చెందిన లిక్కర్ కంపెనీతోపాటు జగన్ కుడి భుజం లాంటి మరో ఎంపీ అల్లుడు లిక్కర్ స్కామ్ లో ఉన్నారన్న లీకులు కుదుపులు పుట్టిస్తున్నాయ్. టీఆర్ఎస్ విషయంలో బీజేపీ దూకుడుగా వెళితే మరి జగన్ పరిస్థితి ఏంటి ?
ఇదే ఇప్పుడు అసలు పాయింట్. తెలుగు రాష్ట్రాలు రెండూ వేర్వేరుగా కనిపిస్తున్నా… రాజకీయ డీఎన్ఎ ను స్టడీ చేస్తే మాత్రం పరస్పరం డిపెండెంట్ అని అర్థం అవుతుంది. అందుకే చంద్రబాబును కేసీఆర్ ఓడించగలిగారు ఏపీలో ! అదే రకంగా ఇప్పుడు కేసీఆర్ ను బీజేపీ దెబ్బ కొట్టాలంటే ప్రొ చంద్రబాబు మైండ్ సెట్ ఉన్న వర్గాలన్నిటి దన్నూ బీజేపీకి కావాలి. అందుకే రామోజీతో మంతనాలు, ఎన్టీఆర్ తోనూ సమావేశాలు లాంటివన్నీ ! ఇవన్నీ ఎంత వరకూ ఫలితం ఇస్తాయ్ అంటే – ఓ కండిషనల్ క్లాజ్ ఉంటుంది. తెలంగాణలో ప్రో అంధ్రా జనం మైండ్ మారాలంటే ఏపీలో బీజేపీ తీరు మారాలి.
ప్రో టీడీపీ ఆలోచనాపరుల ఓట్లు తెలంగాణలో ఆరు శాతానికిపైగా ఇప్పటికీ ఉన్నాయన్నది బీజేపీ లెక్క. అందుకే అమిత్ షా ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలంగాణ వ్యవహారాలు అన్నీ చూస్తున్నది ఆయనే ! ఈడీ సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలన్నీ ఆయన శాఖ పరిధిలోనివే ! ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ పై ఎదురుదాడి ఎంత అవసరమో, టీడీపీ అనుకూల వర్గాలను ఆకట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే జగన్ విషయంలో బేజపీ వ్యూహం మారిందన్న మాట వినిపిస్తోంది.
అవునన్న మాటే వినపడే పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ మీద ఎదురుదాడి చేస్తే తెలంగాణలో లాభం. యాంటీ జగన్ ఉన్నామని బీజేపీ చేతల్లో చూపితే అటు ఆంధ్రాలో సానుకూలతతోపాటు ఇటు తెలంగాణలోనూ కలిసొచ్చే అవకాశం ఉండొచ్చని బీజేపీ భావిస్తే రాజకీయం తిరగబడటం ఖాయం. ఎందుకంటే ఏపీలో జగన్ వ్యతిరేక పవనాలు ఉన్నాయని కేంద్ర మంత్రులే చెప్పి పోతున్నారు. అనురాగ్ ఠాగూర్ లేటెస్ట్ ఎగ్జాంపుల్. బీజేపీలో పొత్తులో ఉన్న పవన్ ఎలాగూ కత్తి దూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీలో కూడా బీజేపీ వైఖరి మారే అవకాశం ఉండొచ్చు.
చూడాలి. ఇప్పుడు కనుక ఢిల్లీలో సంకేతం అందడం నిజం అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాన్ని బీజేపీ క్రమంగా అర్థం చేసుకుంటున్నట్టే అనుకోవాలి. ముందు కేసీఆర్ జగన్ లింకు తెంచి, ఆ తర్వాత పొటిలికల్ అజెండేను అమలు చేసేందుకు సిద్ధపడుతూ ఉండి ఉండాలి. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత బిట్వీన్ ద లైన్స్ అర్థం అవుతున్నది ఇదే !