పోలీసుల స్టేట్‌మెంట్ తరువాత కూడా రెక్కీపై పవన్, టీడీపీ వ్యాఖ్యలు
రెక్కీ లేదు కుట్రా లేదని తేల్చిన తెలంగాణ పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లో అటు నుంచి నరుక్కువచ్చే పద్దతికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. తన మాటలు ఎవరూ నమ్మడం లేదని తెలిసి పవన్‌ను పావుగా వాడుకుని జగన్ సర్కారుపై దుష్ప్రచారం చేయడం మొదలెట్టారు. తాజాగా
హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, పవన్ హత్యకు కుట్ర జరుగుతోందని, అందుకే రెక్కీ జరిగిందని, దానికి జగన్ సర్కారే కారణమని చంద్రబాబు అండ్ గ్యాంగ్ గగ్గోలు పెట్టింది. ప్రశ్నిస్తే చంపేస్తారా అని చంద్రబాబు వీరలెవెల్లో ఆవేశంతో ఊగిపోయారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్ర బలగాలతో పవన్‌కు రక్షణ కల్పించాలని కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేశారు. అయతే పవన్ మీద రెక్కీలేదు కుట్రా లేదు అంతా ఉత్తదే అని తెలంగాణ పోలీసులు తేల్చేశారు. ముగ్గురు తాగుబోతులు పీకల్దాక తాగి పవన్ ఇంటి ముందు కారు ఆపితే అది రెక్కీ అని గోల గోల చేశారని పోలీసులు స్పష్టం చేశారు.
అయినాసరే ఈ ఇష్యూను ఇంత తేలిగ్గా వదిలిపెట్టాలనుకోవట్లేదు చంద్రబాబు అండ్ గ్యాంగ్. అంటే దీన్ని ఎంత లాగితే అంత మైలేజీ వస్తుందని వారికి తెలుసు. అందుకే శనివారం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎంత మంది ఎన్ని రెక్కీలు నిర్వహించినా భయపడేది లేదని అన్నారు. పవన్ ఇంటి ముందు న్యూసెన్స్ చేసిన ముగ్గురు యువకులను విచారించిన తరువాత రెక్కీ లాంటిదేమీ లేదని తెలంగాణ పోలీసులు తేల్చిన తరువాత కూడా పవన్ ఈవిధంగా మాట్లాడ్డం చూస్తే వీళ్లందరూ కలిసి పక్కా ప్రణాళిక ప్రకారమే రెక్కీ నాటకం ఆడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లతో స్కెచ్ వేశారని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. అందుకోసమే రెక్కీ చేశారని వెల్లడించారు. ఇందులో తాడేపల్లి హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. అంటే పవన్ హత్యకు కుట్ర, రెక్కీ, దాడి అంటూ ఈ అంశాన్ని వదిలేయకుండా అలాగే సాగదీస్తూ తన సామాజిక వర్గాన్నంతటిని జనసేన వైపు తిప్పుకుని టీడీపీకి గంపగుత్తగా అమ్ముకోడానికి పవన్ ఈ ఎత్తు వేశాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.