డాక్టర్ రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీకి వివాదాల్లో చిక్కుకుంది. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వచ్చిన శేఖర్ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అంతలోనే అదే రోజు చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో శేఖర్ మూవీ కి బ్రేక్ పడింది. రూ. 65 లక్షలు డిపాజిట్ చేయాలని కూడా కోర్టు తెలిపింది. థియేటర్లు, డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్ లో ఎలాంటి ప్రసారాలు చేయొద్దని కోర్టు పేర్కొంది.
65 లక్షల విషయంలో ఫైనాన్షియర్ వేసిన పిటిషన్ పై కోర్టు ఆదేశాలిచ్చింది. నగదు చెల్లించకపోతే ధియేటర్లు, డిజిటల్ శాటిలైట్ ప్రచారాలు నిలిపివేయాలన్న ఆదేశాలు నిర్మాతతోపాటు జీవిత రాజేశేఖర్ కు షాకి్ ఇచ్చాయి.
ఆపరేషన్ గరుడ కూడా అంతే..
వివాదంలో చిక్కుకున్న రాజశేఖర్ చిత్రాల్లో ఇది రెండోది . గతంలో ఆపరేషన్ గరుడ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా వివాదం కోర్టులో నడిచింది. గరుడ వేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ జీవితను టార్గెట్ చేశారు. సెలబ్రిటీ పేరుతో మోసాలు చేశారని ఆరోపించారు. చివరికి ఆ వివాదం తేలిపోయింది. కాని శేఖర్ మూవీకి విడుదల రోజే ఎదురుదెబ్బ తగిలింది
జీవితరాజశేఖర్ తనపై కొ్ందరు కుట్ర పన్ని ఇదంతా చేశారని ఆరోపిస్తున్నారు. సినిమా ఆడియో సమయంలో కూడా ఆమె ఇదే విషయం చెప్పారు. అయితే సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండవనుకున్నారు. అనూహ్యం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిర్మాత, హీరో డీలా పడ్డారు.
వెంటాడుతున్న వివాదాలు
నిజానికి వివాదాలేమీ జీవిత రాజశేఖర్ కు కొత్త కాదు. చిరంజీవికి రాజశేఖర్ కు ఉన్న విభేదాలతోనే ఆమె అందరి కళ్లల్లో పడ్డారు. తర్వాత ఇద్దరు హీరోల మధ్య ఏమీలేదని సర్ది చెప్పుకున్నారు కూడా. అటు మా ఎన్నికల సమయంలో కూడా వివాదం జీవిత చుట్టూ తిరిగింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన జీవిత లక్ష్యంగా వివాదాలు ముదిరాయి. ఆమె కూడా విమర్శలకు అదే స్థాయిలో బదులిచ్చింది.
కూతురి అలవాటు గురించి చెప్పబోయి..
సినిమాల ఇష్యూ కొనసాగుతూ ఉండగానే జీవిత మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కోమటి వర్గానికి గురించి జీవిత యధాలాపంగా చేసిన కొన్ని కామెంట్లు తలనొప్పిని తెప్పించాయి. ఆమె మాటలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ ఆ వర్గం జీవితరాజశేఖర్ పై విమర్శలు చేశాయి. నెటిజన్లు కూడా జీవితనే తప్పుపట్టారు. చివరకు ఆమె తన ఉద్దేశం అది కాదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదృష్టం కొద్దీ ఈ వివాదం అక్కడితో ముగిసింది. మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్న వాదన సిని వర్గాల నుంచి వచ్చింది.
ఇలా ప్రతీ విషయంలో జీవిత ఎన్నో వివాదాలు దాటుకుని శేఖర్ మూవీని పూర్తి చేశారు. సినిమా ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించిన తర్వాత ఇప్పుడు వివాదంలో చిక్కుకుని ఆగిపోవడంతో జీవిత, రాజశేఖర్ ఇద్దరూ ఇబ్బందుల్లో పడ్డారు.