జాన్సన్ బేబీ ఫౌడర్ తో కేన్సర్

By KTV Telugu On 1 September, 2022
image

ప్రతీ తల్లి తమ శిశువులకు, చిన్నారుల దేహంపై పూసే మెత్తని జాన్సన్ పౌండర్ ఆరోగ్యానికి హానికరంగా ఉందని స్వయంగా ఆ కంపెనీ ప్రకటించింది. అమెరికాలో వేలాదిమంది ఈ పౌడర్ పై కేసులు వేయడంతో కంపెనీ దిగివచ్చింది. రెండేళ్ల క్రితం అంటే 2020లోనే అమెరికా, కెనడాలో ఈ పౌడర్ విక్రయాలు నిలిపేశారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మరో ప్రకటన వచ్చింది. 2023 కల్లా ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలు ఆపేస్తామని జాన్సన్ సంస్థ అంటోంది. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ పౌడర్ విక్రయాలు జరుగుతున్నాయి. ఉత్పత్తులను ఉపసంహరించుకోవడం అంత తేలిక కాదు.

మన దేశంలో చిన్న పిల్లలున్న ప్రతీ ఇంట్లో జాన్సన్ పౌడర్ ఉంటుంది. పిల్లల దేహంపై పొక్కులు, పుండ్లు రాకుండా ఉండేందుకు గతంలో డాక్టర్లే .. జాన్సన్ పౌడర్ ను వాడమని చెప్పేవారు.. నిజానికి 1894 నుంచే జాన్సన్ కంపెనీ పిల్లల కోసం పౌడర్లు ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అమెరికా దశాబ్దాలుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక సందర్భంలో అమెరికా కోర్టు జాన్సన్ కంపెనీకి 15 వేల కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించింది. తాము తయారు చేస్తున్న పౌడర్ లో రాతినార ఉన్నట్లు కంపెనీ స్వయంగా అంగీకరించింది. అందుకే ఇప్పుడు ఆ సరుకును మార్కెట్ నుంచి ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది…

ఆస్బెస్టాస్ వల్ల మాతాశిశువులకు ఆరోగ్య సమస్యలు ఖాయమని తేల్చేశారు.తల్లులు వాడే శానిటరీ నాప్ కిన్స్ పై ఈ పౌడర్ వేసుకోవడం వల్ల గర్భాశయ కేన్సర్ వస్తుందంటున్నారు. అమెరికాలో 35 వేల మంది ఇలాంటి బాధితులున్నారని గణాంకాలు చెబుతున్నాయి. చిన్నారులకు ఈ పౌడర్ వాడితే లంగ్ కేన్సర్ తో పాటు మరిన్ని వ్యాధులు సంభవిస్తున్నాయి. ఆస్బెస్టాస్ వాడకున్నా సరే… టాల్కమ్ పౌడర్ తో ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాల్కమ్ పౌడర్ రేణువు లు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతే పిల్లలను కాపాడటం కష్టమని చెబుతున్నారు…

మార్కెట్లో చాలా ఉత్పత్తులున్నాయి , నెస్లే, ప్రాక్టర్ అండ్ గాంబల్ సహా పలు సంస్థలు పిల్లల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది జాన్సన్స్ పౌడర్ నే వాడుతున్నారు. ఉత్పత్తుల్లో నాణ్యత పెంచాల్సిన సంస్థ ఇప్పుడు వితండవాదం చేస్తోంది. ప్రపంచంలో అగ్రదేశాలకు ఒక రూల్, ఇండియకు మరో రూలు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. విదేశాల్లో ఉపసంహరిస్తున్న ఉత్పత్తులు వేరని, ఇండియాలో విక్రయిస్తున్నది వేరని చెబుతోంది.

పిల్లలకు వాడే పౌడర్ తయారీ, విక్రయంలో కొత్తదనాన్ని తీసుకొస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్స్ ప్రకటించింది. ఇండియాలో విక్రయించే పౌడర్లో రాతి నార లేదని, మొక్కజొన్న పొడితోనే తయారు చేస్తున్నామని సంస్థ వివరణ ఇచ్చింది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతోంది. అది కూడా ఇంకా ప్రయోగదశలోనే ఉందని వార్తలు వస్తున్నాయి.ఇందులో మరో కోణం ఉంది. భారత ప్రభుత్వ చేతగానితనమే జాన్సన్ కంపెనీ ధైర్యానికి కారణమని చెబుతున్నారు. టెస్టింగ్ ప్రక్రియను సమర్థంగా నిర్వహించపోవడం వల్ల బహుళ జాతి సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం వారి సలహాలు తీసుకోవాల్సి ఉంది