కాజల్ డెలివరీ – సమంత వార్నింగ్

By KTV Telugu On 23 April, 2022
image

ఆమెదో డిఫరెంట్ పర్స్ నాలిటీ. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి పీటలు ఎక్కేసింది. టాప్ యాక్టర్ కొడుకుతో తాళి కట్టించుకొని టాక్ ఆప్ ద టౌన్ అయిపోయింది. విడాకులయ్యాక సోషల్ మీడియాలో ట్రోల్స్ తట్టుకోలేకపోయింది. ఇంతకీ ఎవరామె. ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. ఆమే సమంత.
కొద్దిరోజులుగా చిత్ర విచిత్రమైన ట్వీట్ లు చేస్తున్న హీరోయిన్ స్యామ్ తాజాగా చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. నాగచైతన్యతో విడిపోయాక ఈ గ్లామర్ బ్యూటీ ఇండైరెక్ట్ గా చేస్తున్న ట్వీట్ లు సంచలనం అవుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి రాస్తుందో తెలియక తలోరకంగా మీనింగ్ తీసుకుంటున్నారు.


తాజాగా ఈ బేబి మరో ట్వీటేసింది. ‘‘నా నిశ్శబ్దాన్ని తెలియనితనంగా.. నా మౌనాన్ని అంగీకారంగా.. నా దయని బలహీనతగాచూడొద్దు. దయకూ ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది’’ మౌనం, దయ లాంటి అంశాలపై బౌద్దుల ఆధ్యాత్మిక గురువు దలైలామా రాసిన కోట్ ఇది. ఉన్నట్టుండి ఇప్పుడు స్యామ్ కి ఈ కొటేషన్ ఎందుకు గుర్తొచ్చిందో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

సమంత సూటిగా సుత్తి లేకుండా విషయం చెప్పినప్పటికీ.. ఇది ఎవరికో ఇస్తున్న వార్నింగ్ లాగా కనిపిస్తోంది. మరి ఈ ట్వీట్ చేరాల్సిన వారికి చేరిందా? అనేది మాత్రం తెలియడం లేదు.
ప్రస్తుతం జెస్సీ నటించిన ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఈ సాంగ్స్ లో ఆమె గ్లామర్ ని బాగా దట్టించి వడ్డించచిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ పై ఈ రామలక్ష్మి ట్విట్టర్ లో ఈ రకంగా స్పందించిందా? లేదంటే విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ ఓపెనింగ్ కి రాలేదంటూ సమంతపై కొందరు నెగటివ్ కామెంట్స్ చేశారు. వాటిపై స్యామ్ ఇలా రియాక్ట్ అయిందో… లేక ఇంకా వేరే ఏ విషయమైనా ఉందో తెలియక ఆమె అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

పెళ్లయిన రెండేళ్లకు కాజల్ అగర్వాల్ ఓ చిన్నారికి జన్మనిచ్చాక ఈ విషయాన్ని ఎగ్జాంపుల్ గా చూపుతూ కూడా సమంతని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
కాజల్ హ్యాపీగా సెటిల్ అయ్యారని… కానీ స్యామ్ మాత్రం ఇలా విడాకులు తీసుకున్నారని రకరకాలుగా వచ్చిన ట్రోల్స్ పై ఇన్ డైరెక్టుగా ఇలా వార్నింగ్ ఇచ్చి ఉంటారని కొంతమంది అంటున్నారు.

అంతకు ముందు నాగ చైతన్యతో విడాకులయ్యాక వచ్చిన ట్రోల్స్ పై కూడా స్యామ్ డిఫరెంట్ గా రెస్పాండ్ అయింది. ”ఆడవాళ్లు ఏం చేసినా నైతికత అంటూ ప్రశ్నిస్తారు. మగవాళ్లకి ఈ ప్రశ్న ఎప్పుడూ ఉండదు. ఓ సమాజంగా మనకే ఎటువంటి నైతికత లేదు” అంటూ ఓ కొటేషన్‌ను పోస్ట్‌ చేసింది.
ఈ బేబీ ఘాటు రియాక్షన్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తున్నా.. ఎవరిని టార్గెట్ చేసిందో ఆమెకే తెలియాలి అంటున్నారు అభిమానులు.