కాంతార నెక్ట్స్ టార్గెట్ పుష్ప?
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైంది పుష్ప. ప్యాన్ ఇండియా మార్కెట్ ను ఒక ఊపు ఊపింది. వరల్డ్ వైడ్ గా 350 కోట్లకు పైగానే రాబట్టింది. ఇప్పుడు పుష్ప సినిమా వసూళ్లు లక్ష్యంగా, కాంతార దుసుకుపోతోందని, సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. కాంతార థియేటర్స్ లోకి వచ్చి నెల రోజులు దాటింది. ఇప్పుడు ఈ సినిమా వసూళ్లు 300 కోట్ల మార్క్ కు చేరువలో ఉన్నాయి. మరికొద్ది రోజులు ఈ సినిమా వసూళ్లకు తిరుగులేదు. ఇప్పటికే కన్నడలో కేజీయఫ్ 1 రికార్డులను అధిగమించింది కాంతార. ఇప్పుడు టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప వసూళ్లను కూడా ఈ చిత్రం అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియాలోనే 280 కోట్లకు పైగా రాబట్టిన కాంతార ఓవర్సీస్ నుంచి మరో 30 కోట్లు రాబట్టింది. అప్పుడు పుష్ప ఏవిధంగా అయితే స్లోగా 350 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిందో, ఇప్పుడు కాంతార కూడా సేమ్ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తోంది. ఈ లెక్క పుష్ప రికార్డులు బద్దలు కావచ్చు అని ట్రేడ్ వర్గాల అంచనా.