త్వరలో సీక్వెల్ ఉంటుందా?
100 కోట్ల క్లబ్ లోకి బ్లాక్ బస్టర్
ఏ ఇండస్ట్రీలో చూసినా కాంతారా మేనియానే కనిపిస్తోంది. ఇక కన్నడ ఇండస్ట్రీలో ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లను అందుకుంటోంది. చాలా తక్కువ సమయంలో 100 కోట్ల వసూళ్లను దాటింది కాంతారా.
ఇదే సమయంలో ఈ సినిమా సీక్వెల్ పై స్పందించాడు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. ప్రస్తుతానికి తన దగ్గర సీక్వెల్ ఐడియా అంటూ ఏదీ లేదని, కాని మొదటి భాగం ముగింపులో కొంత లీడ్ ఇచ్చి ఉంచామని,
పకృతి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో, సీక్వెల్ కు అవకాశం ఉంటుంది అంటున్నాడు రిషబ్.
కేజీయఫ్ రెండు భాగాలకు సంబంధించి ప్రశాంత్ నీల్ ముందు నుంచే ప్లాన్ తో వెళ్లాడు. ఫ్యూచర్ లో కేజీయఫ్ 3 కూడా ఉంటుందని ప్రకటించాడు. కాని కాంతారా విషయంలో అలాంటి ప్లాన్ చేయలేదు రిషబ్.
కేవలం 16 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా, 100 కోట్లు రాబట్టడం, ప్యాన్ ఇండియా మార్కెట్ లో ప్రదర్శించాలని డిమాండ్ రావడంతో, కాంతారా ఒక్కసారిగా కేజీయఫ్ కు వచ్చిన క్రేజ్ వచ్చింది.
ఇదే స్పీడ్ లో సీక్వెల్ కూడా తెరకెక్కితే మాత్రం, కన్నడ నాట చాలా రికార్డులు బద్దలు కావడం ఖాయం.