డైరెక్ట్ గా రాఖీ భాయ్ ను టార్గెట్ చేసారా?
250 కోట్లు కొల్లగొట్టడం సాధ్యమేనా?
కన్నడ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాంతారా గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. శాండల్ వుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్యాన్ ఇండియా ఆడియెన్స్ . అందుకు తగ్గట్లే ఈ వీకెండ్ లో కాంతారాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కు ఏర్పాట్లు చెస్తున్నారు. తెలుగులో కాంతారాను స్వయంగా అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంటే కాంతారా టార్గెట్ కేజీయఫ్ 1 వైపే ఉందనే వార్తలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కేజీయఫ్ మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లు కొల్లగొట్టింది. కేజీయఫ్ 2 రిలీజ్ కు ముందు వరకు కన్నడ ఇండస్ట్రీలో నెం.1గా నిలిచింది. కేజీయఫ్ 2 వరల్డ్ వైడ్ గా 1250 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంటే కేజీయఫ్ 1 రికార్డ్ ను క్రాస్ చేసేందుకు మొన్నటికి మొన్న విక్రాంత్ రోణ సీరియస్ గా ట్రై చేసాడు. దాదాపు 200 కోట్ల మేర వరకు రాబట్టాడు. ఆ తర్వాత డల్ అయ్యాడు. ఇప్పుడు కాంతారా కేజీయఫ్ 1 వసూళ్లను సీరియస్ గా టార్గెట్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 100 కోట్ల వసూళ్లను దాటిన ఈ సినిమా ఈ వీకెండ్ కు ప్యాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ అయ్యి క్లిక్ అయితే మాత్రం కేజీయఫ్ 1 రికార్డు బద్దలు కావడం ఖాయం. మరి కన్నడలో దుమ్ము దుమ్ము ఆడుతున్న కాంతారా అదే స్థాయిలో ప్యాన్ ఇండియన్ ఆడియెన్స్ ను మెప్పిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.