కేసీఆర్‌ కుంటుంబంపై 18 లక్షల కోట్ల కుంభకోణం ఆరోపణలు

By KTV Telugu On 12 October, 2022
image

మునుగోడో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రులు కేటీఆర్‌, జగదీశ్వర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి దక్కించుకున్న 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును ప్రస్తావిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్ తో కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడిందని అన్నారు. ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే ఏకంగా రూ. 18 లక్షల కోట్ల విలువైన భూములను ఆక్రమించారని చెప్పారు. మన దేశంలోనే ఇది అతిపెద్ద భూ కుంభకోణమని అన్నారు. ధరణి పోర్టల్ పై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్‌గోపాల్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌ మంత్రులపై తీవ్రంగా విరుచుపడ్డారు. కేసీఆర్‌ చెప్పినట్లు చేసే బానిసల్లారా రాబోయే కాలం మాది…మీ అందరికీ తగిన బుద్ది చెబుతాం గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు. రాజ్‌గోపాల్‌ రాజీనామా దెబ్బకు మంత్రులందరూ మునుగోడు ప‌్రజల ఇళ్లముందు పడిగాపులు కాస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి ఓటు వేసింది రాష్ట్రాన్ని మంగా పరిపాలించమని కానీ బెల్టు షాపులు పెట్ట మహిళల పుస్తెలు తెంచడానికి కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.