కొడంగల్ కొట్టేదెవరు..? అడుగుపెట్టేదెవరు?

By KTV Telugu On 12 June, 2022
image

తెలుగు రాష్ట్రాల్లో కొడంగల్ పేరు వినిపించగానే గుర్తుకొచ్చేది రైజింగ్ లీడర్ రేవంత్ రెడ్డే. గత ఎన్నికల్లో ఈ ప్రాంత ఎన్నికలు బెట్టింగ్ రాజాలు కోట్ల రూపాయలు పందాలు కాశారంటేఅర్ధం చేసుకోవచ్చు. ఈ నియోజకవర్గం స్పెషాలిటీ. నువ్వా- నేనా టఫ్ ఫైట్ లో రేవంత్ ను ఓడించి పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఈ ఎన్నిక సమయంలో జరిగిన డ్రామా అప్పట్లో సంచలనం రేపింది. ఈసారి ఎన్నికల్లో కొడంగల్ రాజకీయం ఎలా ఉండబోతోంది.? కాంగ్రెస్ తిరిగి  చేజిక్కించుకుంటుందా..?కారు కంటిన్యూ అవుతుందా..?ఇంతకీ కొడంగల్ నుంచి రేవంత్ పోటీ చేస్తారా..? ఓసారి చూద్దాం.

రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో హాట్ టాపిక్

కర్ణాటక సరిహద్దుల్లో ఉంది కొడంగల్. వికారాబాద్ జిల్లాలో ఉన్న ఈ చిన్న నియోజకవర్గం గురించి అంతకముందు పెద్దగా తెలియదు. కాని రేవంత్ రెడ్డి పోటీతో అంతా హాట్ టాపిక్ పాయింట్ అయింది. నియోజకవర్గం పేరు రాష్ట్రమంతటా మార్మోగింది. రేవంత్ లాంటి బలమైన నేత పోటీ చేసే స్థానం కావడంతో అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఏయ్ బిడ్డా ఇదినా అడ్డా అని గర్వంగా చెప్పుకున్న కొడంగల్ రిజల్ట్ 2018లో కారు సొంతమైంది.

ప్రస్తుత పొలిటికల్ సీన్ ఎలా ఉంది?

రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేతను ఓడించి పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు కానీ తర్వాత నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలులేవు. ప్రజలతో మమేకమై తిరిగే వ్యక్తి కాదని విమర్శలు ఉన్నాయి.  అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమని గతంలో రేవంత్ రెడ్డి సవాల్ కూడా విసరడం దానిపై అధికార పార్టీ ప్రతిదాడి చేయడం జరిగింది. ప్రతిష్టాత్మక పోరులో విజయం సాధించిన తర్వాత నరేంద్రరెడ్డి నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్న అపవాదు ఉంది. కనీసం మంత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేయించడం లేదన్నవిమర్శలు ఉన్నాయి. అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రవర్తనలో మార్పులేదని స్థానికులు చెబుతున్నారు.

ఈసారి ఎవరికి టికెట్ ?

2014 టీడీపీ తరపున రేవంత్ రెడ్డి 14వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. తర్వాత మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పటికే పక్కలో బల్లెంలో తయారైన రేవంత్ ను ఓడించేందుకు అప్పటి టీఆర్ఎస్ మంత్రులు, నేతలు రౌండప్ చేశారు. రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో కొడంగల్‌లో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోలీసులు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కి  43శాతం ఓట్లు టీఆర్ఎస్ కు 48శాతం ఓట్లు రావడం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్ధి  9వేల3వందల ఓట్లతో ఆధిక్యం సంపాదించి రేవంత్ ని ఓడించారు. ఈసారి కూడా రేవంత్ కొడంగల్ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని పార్టీ వర్గాల్లో ధీమా కనిపిస్తోంది. ఈసారి పరిస్థితులు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని గట్టిగా నమ్ముతోంది. పట్నం నరేందర్ రెడ్డికే మళ్లీ సీటు ఇవ్వాలని పార్టీ నాయత్వం ఆలోచన ఉంది. రేవంత్ లాంటి వ్యక్తిని ఓడించిన నేతను కాదని మరోకరిని అభ్యర్ధిగా టీఆర్ఎస్ అధిష్టానం ఎంపిక చేసే అవకాశం లేదు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీ గెలుపు కష్టమేనన్న అభిప్రాయం ఉంది. ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే వ్యక్తిగా ఆదరించడం అక్కడ ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది. రేవంత్ లాంటి నేతకు నియోజకవర్గం కొట్టిన పిండి. మళ్లీ రేవంత్ కాంగ్రెస్ తరపున అభ్యర్ధిగా నిలబడితే మాత్రం విజయాన్ని ఎవరూ ఆపలేరన్న భావన ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇస్తే టీఆర్ఎస్ కు విజయవకాశాలు ఉండబోదన్న ప్రచారం ఉంది.

కొడంగల్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ఈనియోజక వర్గంలో పోటీ ఎప్పుడూ రెండు పార్టీల మధ్యనే ఉంటూ వస్తోంది. మూడో పార్టీకి నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఆది నుంచి కాంగ్రెస్ కు కొడంగల్ కంచుకోటగా ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నాలుగుసార్లు, టీడీపీ రెండుసార్లు, టీఆర్ఎస్ ఒకసారి గెలుచుకుంది. రేవంత్ కి టీడీపీ అవకాశం ఇవ్వడంతో రెండు సార్లు ఆ పార్టీ ఎన్నికల్లో జెండా ఎగరేసింది. 2018లో తొలిసారిగా టీఆర్ఎస్ గెలిచింది.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈనియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉండటం ఖాయంగా ఉంది. బీజేపీకి చెప్పుకోదగ్గ కేడర్, లీడర్లు ఎవరూ లేరూ. ఒకవేళ రేవంత్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోతే ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి బరిలో దిగే అవకాశాలు ఎక్కువ. అలా జరిగితే గెలుపు మాత్రం టీఆర్ఎస్ టఫ్ ఫైట్ అవుతుందని టాక్. నియోజకవర్గంలో చాలా రోజులుగా నీళ్ల సమస్య ఉంది. మౌలిక వసతులు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కొడంగల్ ను కేటీఆర్ దత్తత తీసుకున్నా అభివృద్ధి సంగతి మరిచిపోయారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇందుకు అధికార పార్టీ నుంచి సరైన సమాధానం మాత్రం రాలేదు.