సోషల్ మీడియాలో కేటీఆర్ స్పందిస్తున్న తీరు కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ను గుర్తు చేస్తోంది. కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు సుష్మ స్వరాజ్ స్పందించిన తీరు మరిచిపోలేం. వీసా సమస్యల్లో చిక్కుకుపోయినప్పుడు ఎవరైనా ట్వీట్ చేస్తే వెంటనే స్పందించే గుణం ఆమె సొంతం. తనకు వీలైనంత సాయం చేస్తూ ఎంతో మందిని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సుష్మ బతికున్నంతకాలం చివరి నిమిషం వరకు తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను పరిష్కరించేవారు. అలా ఎంతో మంది గుండెల్లో చెరగని ముద్ర వేశారు. సుష్మా తర్వాత అదే స్థాయిలో సమస్యల్ని వేగంగా పరిష్కరించిన మరో లీడర్ కనిపించలేదు.
మన తెలుగు రాష్ట్రాల్లోను అలాంటి నేతే ఒకరున్నారు. ఆయనే కేటీఆర్. ఇప్పుడున్న రాజకీయ నేతల్లో సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేస్తూ వచ్చిన జెన్యూన్ సమస్యలపై స్పందించే ఒకే ఒక్క లీడర్. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తన సహాయం కోరిన వారికి ప్రభుత్వం తరపునతోపాటు వ్యక్తిగతంగా సాయం చేయడంలో కేటీఆర్ స్టైలే వేరు. అన్నా.. మా నాన్నకి ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉన్నారు ఆక్సిజన్ అవసరమన్నారు. ఎవరూ సాయం చేయడం లేదని.. ఒక్క ట్వీట్ చేస్తే వెంటనే పోర్టబుల్ ఆక్సిజనే కాన్సెన్ ట్రేటర్ ను ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు. ఆస్పత్రిలో బెడ్ కూడా లేదంటున్నారు. ఎమర్జీన్సీలో ఉన్నారని ట్వీట్ చేయగానే వారికి అవసరమైన అందించారు. ముఖ్యంగా కరోనాలాంటి క్లిష్ట సమయంలో స్పందించిన ఒక్కే ఒక్క నేత నాయకుడు కేటీఆరే.
కరోనా రోగులకి సోషల్ మీడియా ద్వారా అందించిన సేవల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఒక మంత్రి అంత త్వరగా స్పందిస్తాడా అనుకునే వారికి కేటీఆర్ క్విక్ రియాక్షనే ఆన్సర్.
నరాలవ్యాధితో బాధపడుతున్న తనను ఆదుకోవాలని ఒక వ్యక్తి ట్వీట్ చేస్తే వెంటనే అధికారుల్ని అక్కడి పంపి తగిన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటే పోతే కేటీఆర్ వల్ల సాయం పొందిన వారి లిస్టు ఎక్కువే ఉంటుంది. సాయం పొందినోళ్లు కృతజ్ఞతలు చెబుతూ చేసిన ట్వీట్లే అందుకు సాక్ష్యం. అందుకే మిగిలిన లీడర్లు ఈవిషయంలో కేటీఆర్ ను ఒక్క మాట కూడా అనలేరు.
తనను ట్యాగ్ చేసిన అన్ని ట్వీట్లకు కేటీఆర్ రెస్పాండ్ అవుతారనుకుంటే పొరపాటే. కొంతమంది సిల్లీగా చేసిన కామెంట్లకు కేటీఆర్ ఘాటుగా బదులిచ్చిన సందర్భాలున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోయిందని.. డ్రైనేజీ పొంగుతోందని ప్రభుత్వం ఏం చేస్తోందని అంటూ చేసిన ట్వీట్ కు అదే స్థాయిలో బదులిచ్చారు. పౌరుడిగా ముందు సామాజిక బాధ్యత ఏంటో గుర్తు చేసుకోవాలని తర్వాత మాట్లాడాలని ఆన్సర్ ఇవ్వడంతో అంతా షాకయ్యారు. ఆషామాషాగా చిల్లరగా చేసే కామెంట్లకు ఊహించని విధంగా రెస్పాండ్ అవుతారు కేటీఆర్. అందుకే కేటీఆర్ స్టైలే డిఫరింట్.
సాయం చేయాలని చాలామంది ప్రతీ రోజు ఎవరో ఒక్కరూ ట్వీట్ చేస్తూనే ఉంటారు. అలా అడిగినా ప్రతీ ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తారనుకుంటే పొరపాటే. నిజమైన సమస్యలపై మాత్రమే కేటీఆర్ నుంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా హ్యూమన్ యాంగిల్ ఉన్న సమస్యలపైనే ఆయన నుంచి రిప్లై వస్తుంది..లేటేస్టుగా 8ఏళ్ల పాపకు అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాలని వారిది పేద కుటుంబం అని ఒకవ్యక్తి ట్వీట్ చేయగా.. తన టీం సాయం చేస్తుందని కేటీఆర్ బదులిచ్చారు. నిజంగా తన సాయం అవసరం ఉందని అనిపిస్తేనే వ్యక్తిగతంగా కూడా సాయ పడతారు.
ఇలా ఆపదలో ఉన్నవారికి సాయంచేస్తూ తనదైన శైలిలో రాజకీయాల్లో కొనసాగుతూ ట్రెండింగ్ లీడర్ గా కొనసాగుతున్నారు కేటీఆర్. అందుకే అప్పట్లో సుష్మా సర్వాజ్ ఇప్పుడు కేటీఆర్ అని చెప్పొచ్చు.