తెలుగులో రిలీజ్ అవుతున్న లవ్ టుడే
కోలీవుడ్ ను షేక్ చేస్తున్న స్మాల్ మూవీ
తమిళంలో జయం రవి, కాజల్ కాంబినేషన్ లో కోమలి లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు ప్రదీప్ రంగనాథన్.
ఈ యువ దర్శకుడు ఇప్పుడు లవ్ టుడే మూవీతో హీరోగా మారాడు. గత వీకెండ్ తో కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. చాలా చిన్న చిత్రంగా విడుదలై అతి పెద్ద విజయం అందుకునే దిశగా పరుగులు తీస్తోంది. దాంతో ఈ సినిమా రైట్స్ ను దిల్ రాజు కొనుగోలు చేసాడు. అయితే అందరూ ఊహించినట్లు రీమేక్ కాకుండా, మూవీని డబ్ చేస్తున్నాడు దిల్ రాజు.నవంబర్ 18న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఒక భాషలో సినిమా హిట్టైతే రీమేక్ కాకుండా అదే విధంగా డబ్ చేసి రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది. కాంతార ఇలా రిలీజ్ అయ్యే 300 కోట్ల క్లబ్ లోకి చేరింది. అందుకే దిల్ రాజు కూడా రీమేక్ లాంటి పనులు పెట్టుకోకుండా, ఓరిజినల్ వర్షన్ ను తెలుగులోకి డబ్ చేస్తున్నాడు. మరి తమిళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.