ఇంపాజిబుల్ ఈజ్ పాజిబుల్ ఇన్ పాలిటిక్స్
ప్రధాని స్థాయి వ్యక్తి షర్మిలకు ఫోన్ చేయడం అలాంటిదే !
ఎలాంటి ఇంపాజిబుల్ అంశాన్ని పాజిబుల్ చేయడానికి ఫోన్ ?
తెర వెనుక టార్గెట్ తెలంగాణనా ? ఏపీనా ?
ఇంపాజిబుల్ ఈజ్ పాజిబుల్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో అసాధ్యమైనదంటూ ఏమీ ఉండదు. ప్రధాని స్థాయి వ్యక్తి తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా ఉనికి లేని పార్టీ అధ్యక్షురాలు రాజకీయ పోరాటంలో భాగంగా అరెస్ట్ అయితే ఫోన్ చేసి సానుభూతి తెలుపడం ఇలాంటి పాజిబుల్స్లో ఒకటి అనుకోవచ్చు. ఈ ఘటన ఎలాంటి ఇంపాజిబుల్ అంశాన్ని పాజిబుల్ చేయడానికి ? తెర వెనుక టార్గెట్ తెలంగాణనా ? ఏపీనా ?
చెల్లి షర్మిలపై తెలంగాణలో దాడి జరిగితే స్పందించని జగన్.
మోదీ నేరుగా అడిగారని మీడియా రిపోర్టు.
తర్వాత మోదీ షర్మిలకు ఫోన్.
చెల్లి షర్మిలపై తెలంగాణలో దాడి జరిగితే స్పందించలేదేమిటని జగన్‌ను మోదీ ప్రశ్నించారని కొన్ని మీడియాలు వెల్లడించినప్పుడు చాలా మంది నమ్మలేదు. ఆ సంస్థలు ఎప్పుడూ అలాగే రాస్తాయని అనుకున్నారు. తర్వాత మోదీ షర్మిలకు ఫోన్ చేశారనే విషయం బయటకు తెలిసినప్పుడూ అంతే. కానీ జాతీయ మీడియా కూడా ఇదే విషయం ఖరారు చేయడంతో అందరిలోనూ ఆశ్చర్యం.
తెలంగాణలో ఉనికి లేని షర్మిల పార్టీ
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమే అతకదు!
ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీస ఓట్లు సాధించడం డౌటే
షర్మిలకు మద్దతు ఇచ్చి తెలంగాణలో బీజేపీ బావుకునేది ఏమిటి ?
ఎందుకు ప్రధాని మోదీ షర్మిలకు ప్రయారిటీ ఇచ్చారు ?
తెలంగాణలో షర్మిల పార్టీకి ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. అక్కడి ప్రజలు అసలు ఆ పార్టీని పట్టించుకోవడమే లేదు. రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో తీసుకురావాలన్నదే ప్రథాన అజెండా అని చెప్తూ దాదాపు ఏడాదిన్నరగా పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు షర్మిల. ఉద్యోగ దీక్షలు చేశారు. ఉద్యమాలు నడిపారు. పాదయాత్రలు చేస్తున్నారు. ఫిర్యాదులు చేశారు. తెలంగాణ సీఎం కుటుంబాన్ని డైరక్ట్ అటాక్ చేశారు. కానీ గ్రౌండ్ లెవల్ రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి అర్థమయ్యేదంటే ఆమె ఎంత ఆర్గనైజ్డ్ గా పార్టీని నడిపిస్తున్నా, పాదయాత్రలు చేస్తున్నా, మీడియాలో కనిపిస్తున్నా ఆమె ప్రభావం మాత్రం అంతంతే. అసలు వైఎస్ షర్మిల రెడ్డి ఉన్నట్టుండి తెలంగాణలో పార్టీ పెట్టడమే చాలా మందికి షాక్ ఇచ్చింది. తన తండ్రికి బలం ఉన్న ఏపీ కాకుండా తెలంగాణలో అడుగుపెట్టారు. అన్నతో ఇష్యూ ఉంటే అక్కడ తేల్చుకోవాలే కానీ తెలంగాణకు రావడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా షర్మిల పార్టీ కనీస ఓట్లు సాధించడం డౌటే. అలాంటిది షర్మిలకు మద్దతు ఇచ్చి తెలంగాణలో బీజేపీ బావుకునేది ఏమీ ఉండవు. మరి ఎందుకు ప్రధాని మోదీ షర్మిలకు ప్రయారిటీ ఇచ్చారు ?
బీజేపీ దేశం మొత్తం ఎదిగినా ఏపీలో నోటా దగ్గరే.
ఇప్పటికిప్పుడు ఏపీలో బలం పుంజుకోవడం కష్టం.
రెండు ప్రాంతీయ పార్టీల్లో ఏదో ఒక దాన్ని కబ్జా చేయాలి !
టీడీపీతో పాటు వైసీపీపైనా రెక్కీ.
తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎన్టీఆర్‌ని దువ్వే ప్రయత్నం.
పెద్దగా ఆసక్తి చూపని ఎన్టీఆర్.
షర్మిల వైపు నుంచి చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్.
వచ్చే ఎన్నికల తర్వాత షర్మిలకు తెలంగాణలో పార్టీ పరిస్థితిపై క్లారిటీ.
ఆ తర్వాత ఏపీకి షర్మిల రాజకీయం షిఫ్ట్.
బీజేపీ దేశం మొత్తం ఎదిగినా ఏపీలో నోటా దగ్గరే ఉంది. ఇది మోడీ, బీజేపీకి తలవంపులుగా ఉన్నదన్నమాట నిజం. అందుకే ఏపీపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికిప్పుడు ఏపీలో బలం పుంజుకోవడం సాధ్యం కాదు. ఏపీలో ప్రధాన పార్టీగా అవతరించాలంటే ఏదో ఓ ప్రాంతీయ పార్టీని బీజేపీ కబ్జా చేయాల్సి ఉంటుంది. టీడీపీతో పాటు వైసీపీపైనా రెక్కీ చేసింది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎన్టీఆర్‌ని దువ్వింది. వైసీపీ వైపు నుంచి షర్మిలను దువ్వుతోంది. ఎన్టీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడల్లా తాను రాజకీయాల్లోకి రానని సందేశాన్ని స్ట్రాంగ్‌గానే పంపారు. బీజేపీ ప్రయత్నాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ షర్మిల వైపు నుంచి చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ అవుతున్నాయి. బీజేపీకి షర్మిల రూపంలో ఏపీలో అడుగు పెట్టడానికి మంచి అవకాశం దొరికింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో పది నెలల్లో పూర్తయిపోతాయి. అప్పుడు షర్మిలకు తెలంగాణలో తమ పార్టీ పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుంది. ఎంత చేసినా తెలంగాణ సమాజం తమ పార్టీని అంగీకరించదని షర్మిలకూ తెలుస్తుంది. రాజకీయ దోమ కుట్టిన ఎవరైనా అధికారానికి దగ్గరగా కనిపించే ప్రాంతానికే వెళ్తారు. షర్మిల విషయంలోనూ బీజేపీ అదే ప్లాన్ అమలు చేస్తుంది. తాము అండగా ఉంటామని ఏపీలోకి రావాలని ఆకర్షించవచ్చు. అందుకే ఇప్పుడు నేరుగా మోదీనే ఆమెతో టచ్‌లోకి వచ్చారని ప్రత్యేకంగా విశ్లేషించుకోనక్కరలేదు.
ఇప్పటికే ఏపీలో రాజకీయ సమావేశాలు పెట్టిన బ్రదర్ అనిల్.
ఏపీ రాజకీయాలపైనా ఆసక్తి ఉందని బయటకు చెబితే తెలంగాణలో సీరియస్ నెస్ ఉండదు!
బీజేపీ ఇప్పటికే రెడీ చేసిన గ్రౌండ్‌కు షర్మిల నాయకత్వం.
ఫామ్ హౌస్ ఫైల్స్ లో వెలుగులోకి యాభై మందికిపైగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో బేరం.
తాను తెలంగాణకే పరిమితం అని షర్మిల కుండబద్దలుకొడుతున్నారనే డౌట్ రావొచ్చు. కానీ షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఏపీలో రాజకీయ సన్నాహాలు చేశారనే సంగతిని మరిచిపోలేం. అంతే కాదు ఎక్కడైనా పోటీ చేయవచ్చని అది ప్రజాస్వామ్య హక్కు అని షర్మిల చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు తనకు ఏపీ రాజకీయాలపైనా ఆసక్తి ఉందని బయటకు చెబితే తెలంగాణలో సీరియస్ నెస్ ఉండదని ఆమె అలా చెబుతూ ఉండవచ్చు. కానీ రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె అసలు రాజకీయం ప్రారంభం కావొచ్చు. బీజేపీ ఇప్పటికే రెడీ చేసిన గ్రౌండ్‌కు షర్మిల నాయకత్వం తోడైతే ఏపీలో వైఎస్ఆర్సీపీనే బీజేపీగా మారుతుంది. ఇప్పటికే యాభై మందికిపైగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో బేరం కుదుర్చుకున్నామని ఫామ్ హౌస్ కేసులో నిందితులు స్వయంగా చెప్పిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు.
జగన్‌ను వెంటాడుతున్న అక్రమాస్తుల కేసు.
షర్మిల రూపంలో ప్రత్యామ్నాయాన్ని రెడీ చేసుకుంటున్న బీజేపీ.
ఏ పార్టీలో చేరినా తనను సీఎం అభ్యర్థినని షర్మిల ప్రకటనలు.
ఇంపాజిబుల్ ఈజ్ పాజిబుల్ ఇన్ పాలిటిక్స్.
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడటం కష్టం. ఇటీవల హెటెరో కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. షర్మిల రూపంలో ప్రత్యామ్నాయాన్ని బీజేపీ రెడీ చేసుకున్న తరవాత అసలు ప్లాన్‌ను బీజేపీ అమలు చేస్తుందని అనుకోవచ్చు. ఏ పార్టీలో చేరినా తనను సీఎం అభ్యర్థిని చేస్తారని షర్మిల కొన్ని ఇంటర్యూల్లో చెప్పడం ఓ బలమైన సంకేతం. మొత్తంగా బీజేపీ ఏం చేస్తుందో చివరి వరకూ చెప్పడం కష్టమే. కానీ తెలంగాణలో ఏదో ఆసించి షర్మిలకు బీజేపీ అండగా నిలుస్తుందని అనుకోవడం కష్టం. ఈ స్కెచ్ వెనుక ఓ దీర్ఘకాలిక రాజకీయం వ్యూహం. అది ఏపీనే అవడానికి ఎక్కువ చాన్స్ ఉంది. అదే జరిగితే ఇంపాజిబుల్ ఈజ్ పాజిబుల్ ఇన్ పాలిటిక్స్ అని మరోసారి నిరూపితమవుతుంది.