ఆమెకు సీక్రెట్ గా కలిశాడా?
ఫోన్ లోనే పరామర్శించి ఊరుకున్నాడా?
సమంత హెల్త్ బాగోలేదు. మయోసైటీస్ తో ఆమె ఇబ్బంది పడుతోంది అని తెల్సిన మరుక్షణం,
నాగ చైతన్య వెళ్లి ఆమెను కలుస్తాడా అనే చర్చ మొదలైంది. ఆ తర్వాత రెండు రోజులకు నాగ చైతన్య,
సమంత ఇంటికి వెళ్లాడని ప్రచారం మొదలైంది. నిన్న సమంతను నాగ చైతన్య కేవలం ఫోన్ లో మాత్రమే పరామశించాడని టాక్ వినిపించడం మొదలైంది. ఈ మూడింటిలో ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు ఎవరికి తెలియడం లేదు. ఒక్కటి మాత్రం నిజం, సమంతను చూస్తూ చూస్తూ నాగ చైతన్య పట్టించుకోకుండా వదిలేయలేదు. పదేళ్ల ప్రేమ వారి మధ్య ఉంది.4 ఏళ్ల వైవాహిక బంధం ఉంది. విడిపోయినంత మాత్రాన నాగ చైతన్య సమంతకు దూరంగా ఉండాలని లేదు కదా. పైగా చైతూది అలాంటి మనస్తత్వం కూడా కాదు.
కాకపోతే సమంతను కలిసిన విషయం కాని, ఆమెతో మాట్లాడిన విషయం కాని బయటికి తెలిస్తే, మీడియాలో అనవరసమైన రచ్చ ప్రారంభం అవుతుందనే చై ఏ విషయాన్ని బయటపెట్టలేదు. సమంత హెల్త్ గురించి తెల్సి, అఖిల్ కూడా తను త్వరగా కోలుకోవాలనే కోరాడు. అసలు వీరిద్దరికి ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చాయి అనేది మిస్టరీగానే మారింది. కొన్ని సమస్యలపై ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడం వల్లే వేరు పడ్డాం అని ఇద్దరు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తమిళ నాట ధనుష్, ఐశ్వర్య తిరిగి కలిసిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా సమంత, నాగ చైతన్య తిరిగి ఒక్కటి అయితే బాగుంటుందని వేలాది మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.