నాగ న్యూ లవ్ స్టోరీ నిజమేనా?

By KTV Telugu On 26 November, 2022
image

శోభితతో ప్రేమలో పడ్డాడా?
ఆ ఫోటో రియలా ? ఫేకా?

పర్సనల్ లైఫ్ లో ఏం జరిగినా సరే నాగ చైతన్య అసలు చెప్పడు.
కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు.
సమంతతో ప్రేమ విషయం ఏ రోజు కూడా మీ ముందుకు వచ్చి స్పందించింది లేదు.
బ్రేకప్ తర్వాత కూడా సమంత అయినా సరే నాగ చైతన్య తీరును తప్పుబట్టింది కాని చై మాత్రం అసలు బయటపడలేదు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య కొంత కాలంగా శోభిత ధూళిపాళతో లవ్ లో ఉన్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతలో సోషల్ మీడియాలో వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది.
దాంతో నాగ చైతన్య, శోభిత లవ్ ను కన్ ఫామ్ చేసేస్తున్నారు సమంత ఫ్యాన్స్. మరో విధంగా నాగ చైతన్య, సమంత విడిపోవడానికి గూఢచారి హీరోయిన్ మెయిన్ రీజన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఫోటో ఫేక్ అంటున్న వారు లేకపోలేదు. శోభితతో నాగచైతన్య ఫోటో ఎందుకు దిగాడో తెలియదు. అసలు వీరిద్దరు ఫారిన్ హాలీడేస్ కు ఎప్పుడు వెళ్లారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒక వేళ ఫోటో ఫేక్ అయితే ఈ పాటికే ఒక ప్రెస్ నోట్ వచ్చి ఉండాలి. అలా కాకుండా శోభిత, చై సైలెంట్ గా ఉండటం చూస్తుంటే వీరిద్దరు తాము లవ్ లో ఉన్న విషయాన్ని కన్ ఫామ్ చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది అంటున్నారు నెటిజన్స్.